iDreamPost
android-app
ios-app

రాధేశ్యామ్ ఫ్లాప్ అయినా రెమ్యునరేషన్ పెంచేస్తున్న ప్రభాస్.. వేక్ అప్ టీమ్ ఆదిపురుష్ అని ఫ్యాన్స్ ట్రెండ్..

  • Published Jun 22, 2022 | 7:31 PM Updated Updated Jun 22, 2022 | 7:31 PM
రాధేశ్యామ్ ఫ్లాప్ అయినా రెమ్యునరేషన్ పెంచేస్తున్న ప్రభాస్.. వేక్ అప్ టీమ్ ఆదిపురుష్ అని ఫ్యాన్స్ ట్రెండ్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల రాధేశ్యామ్ ఫ్లాప్ అయినా భారీ బడ్జెట్ సినిమాలను అలాగే లైన్ లో పెడుతున్నాడు. ప్రభాస్ చేతిలో ఉన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా ఆదిపురుష్‌ తెరకెక్కుతుంది. ఇందులో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ అయిపొయింది. మిగిలిందంతా VFX పార్ట్. ప్రభాస్ ఒక్కో సినిమాకి 90 నుంచి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. రాధేశ్యామ్ ఫ్లాప్ అయినా తన రెమ్యునరేషన్ తగ్గించకపోగా ఇంకా పెంచుతున్నాడు. ఇటీవల ఆదిపురుష్ సినిమాకి తన రెమ్యునరేషన్ మరో 25 శాతం పెంచమని ప్రభాస్ నిర్మాతలని అడిగినట్లు తెలుస్తుంది. అంటే బాలీవుడ్ సమాచారం ప్రకారం 120 కోట్లు అడుగుతున్నట్టు తెలుస్తుంది. దీంతో నిర్మాతలు ఆశ్చర్యపోయారట.

ఇక ఇది ఇలా ఉండగా ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఒక పోస్టర్ తప్ప ఎలాంటి ఫస్ట్ లుక్ కానీ, సినిమా అప్ డేట్ కానీ ఇవ్వలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలే ప్రభాస్ సినిమాలు చాలా లేట్ అవుతుండటం, ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఆదిపురుష్ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ మరింత సీరియస్ అయి ‘వేక్ అప్ టీమ్ ఆదిపురుష్’ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. మరి దీనిపై ఆదిపురుష్ టీం ఏమన్నా స్పందిస్తుందో చూడాలి.

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabet