iDreamPost
android-app
ios-app

Samantha : సూపర్ స్టార్ మూవీలో సమంతా ?

  • Published Nov 25, 2021 | 5:35 AM Updated Updated Nov 25, 2021 | 5:35 AM
Samantha : సూపర్ స్టార్ మూవీలో సమంతా ?

చైతుతో విడాకులు తీసుకున్నాక కెరీర్ వైపు సమంతా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇకపై అవకాశాలను పాత్రల స్వభావాలను బట్టి కాకుండా తన ఇష్టాన్ని బట్టి ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే పుష్ప పార్ట్ 1లో ఐటెం సాంగ్ కు ఒప్పుకుంది. టీమ్ సైతం ఈ విషయాన్ని అలానే ప్రమోట్ చేస్తున్నారు తప్ప ప్రత్యేక గీతం లాంటి ఉపమానాలు ఏమి పెట్టడం లేదు. ఈ ఒక్క పాటకే సుమారు కోటిన్నర ఇస్తున్నారనే ప్రచారం జరిగింది కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. ఆఘమేఘాల మీద షూటింగ్ పూర్తి చేయాల్సిన పుష్ప టీమ్ బేరాలు ఆడే పరిస్థితిలో లేదు కాబట్టి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ వారమే దీని షూట్ చేయబోతున్నారు.

ఇక విషయానికి వస్తే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మార్పు చోటు చేసుకోబోతున్నట్టు సమాచారం. డేట్స్ కారణంగా తన స్థానంలో సమంతా రావొచ్చని అంటున్నారు. మహేష్ – సామ్ కాంబోతో గతంలో దూకుడు-సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. త్రివిక్రమ్ తో సమంతా అత్తారింటికి దారేది – అఆ లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ చేసింది. ఎలా చూసుకున్నా ఇది క్రేజీ కాంబినేషనే. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా చెప్పలేం. ప్రస్తుతానికి గాసిప్ మాత్రమే.

సమంతకు ఆఫర్లు రావడం మొదలయ్యింది. వెబ్ సిరీస్ ప్రతిపాదనలు కూడా గట్టిగా ఉన్నాయి. గడిచిపోయిన వైవాహిక బంధం గురించి చైతు కూడా మర్చిపోయి క్రమంగా సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పుడు సామ్ కూడా అదే దారిలో ఉంది. తమిళంలో విజయ్ సేతుపతి నయనతారలతో కలిసి చేసిన సినిమా విడుదలకు రెడీ అవుతోంది. తెలుగులోనూ డబ్బింగ్ చేయబోతున్నారు. ఇక పూజా హెగ్డే సంగతి చూస్తే అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ మధ్యలో కోలీవుడ్ మూవీస్ తో మామూలు బిజీగా లేదు. అందుకే మహేష్ సినిమాకు డేట్స్ సమస్య రావొచ్చేమోనని అనుకుంటున్నారట. చూద్దాం ఎంతవరకు నిజమో అబద్దమో

Also Read : Vijetha : అలాంటి క్లాసిక్ కి కొనసాగింపు సాధ్యమేనా

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/