• Home
  • తాజా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • సినిమా వార్తలు
  • Nostalgia
  • ఫోటో గ్యాలరీ
  • రివ్యూస్
  • వీడియోలు
  • ID Exclusive
    • రాజకీయ వార్తలు
    • సినిమా వార్తలు
    • ఫోటోలు
    • రివ్యూస్
    • నోస్టాల్జియా
    • వీడియోలు
    • పోల్స్
    • స్పాట్ లైట్
    • బాక్స్ ఆఫీసు పోర్టల్
    • ట్రెండింగ్ వార్తలు
    • పాపులర్ న్యూస్
    • ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు
    • USA షో టైమ్స్
    Home » News » చంద్రబాబు తీరుపై సీనియర్ల అసహనం, సభలో వ్యూహం దెబ్బతీసిందని గగ్గోలు

    చంద్రబాబు తీరుపై సీనియర్ల అసహనం, సభలో వ్యూహం దెబ్బతీసిందని గగ్గోలు

    • By Raju VS Updated On - 07:26 PM, Fri - 25 March 22 IST
    చంద్రబాబు తీరుపై సీనియర్ల అసహనం, సభలో వ్యూహం దెబ్బతీసిందని గగ్గోలు

    ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అమరావతికి సంబంధించిన చర్చలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించింది. తన వాయిస్ బలంగా వినిపించింది. సుమారు ఐదు గంటల పాటు చర్చలో పాల్గొన్న నేతలంతా ఏపీ రాజధానికి సంబంధించిన అంశంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. కోర్టు తీర్పులు ప్రభుత్వ విధానాలను గట్టిగా వినిపించింది. పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ లక్ష్యాలను చాటిచెప్పింది. దాంతో ఈ వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. సభలో కనీసం విపక్ష వాయిస్ కూడా వినిపించలేకపోవడం ఆపార్టీ నేతలకు మింగుడుపడని స్థితిలో మిగిల్చింది.

    వాస్తవానికి గురువారం నాటి చర్చ మాత్రమే కాకుండా ఆరంభం నుంచి సభలో టీడీపీ వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. సభలో సమస్యలను ప్రస్తావించేందుకు బదులుగా జంగారెడ్డిగూడెం వంటి చిన్న ఘటనను సాకుగా చూపించి నిత్యం రభస చేయడం మినహా సాధించేదేముందనే అభిప్రాయం టీడీపీ నేతల్లోనే వినిపిస్తోంది. సీనియర్లు పలువురు నేతలు ఈ విషయంపై చంద్రబాబుతో విబేధించారు. నిత్యం మద్యం చుట్టూ రాద్ధాంతం చేయడం వల్ల ఉపయోగం ఉండడం లేదని , దాని వల్ల సభలో ప్రభుత్వానికి అడ్డుచెప్పలేని స్థితి వస్తోందని సీనియర్ ఎమ్మెల్యేలు వాపోయినా అధినేత పెడచెవిన పెట్టారు. నిత్యం సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలు ప్రతిపాదించడం, సభ నుంచి సస్పెండ్ అయ్యేంత వరకూ వివాదం చేయడం వల్ల ఉపయోగం ఏమిటనే ప్రశ్న వారి నుంచి వచ్చినా అధినేత ఖాతరు చేయలేదు. రోజూ ప్రశ్నోత్తరాల సమయంలో సైతం టీడీపీ నేతలు వేసిన ప్రశ్నలకు సమాధానాలిచ్చే సమయంలో కూడా సభలో ఉండలేకపోవడం ఏమిటనే ప్రశ్న టీడీపీ సీనియర్ల నుంచే ఉత్పన్నమయ్యింది.

    పలువురు సీనియర్లు, ఇతర నేతలు ఎంతగా మొత్తుకున్నా చంద్రబాబు దానికి ప్రాధాన్యతనివ్వలేదు. పైగా ఎవరైనా ఎమ్మెల్యేలు సస్ఫెండ్ కాని పక్షంలో వారి మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. సభ నుంచి సస్ఫెండ్ కావాల్సిందేననే రీతిలో ఒత్తిడి పెట్టారు. తాను సభకు దూరంగా ఉండడమేకాకుండా, సభకు హాజరయిన వారు సైతం లోపల ఉండకుండా చేసిన వైనం టీడీపీ నేతలకు మింగుడుపడని స్థితికి నెట్టింది. చివరకు అమరావతి వంటి కీలకాంశంలో సైతం సభ ద్వారా అధికార పార్టీ వైఖరి ప్రజల్లోకి వెళ్లగా, టీడీపీ గొంతు వినిపించే అవకాశం కూడా లేకపోవడం విషాదకరంగా మారిందని సీనియర్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇలాంటి తీరు వల్ల టీడీపీ ప్రజలకు దూరమయ్యిందనే వాదన కూడా ఉంది. మద్యం ధరల మీద పార్టీ ఎంతగా అల్లరి చేసినా జనంలో దానికి అనుగుణంగా స్పందనలేదనే వాదన కూడా వారి నుంచి వస్తోంది. ముఖ్యంగా మద్యం ధరలు తగ్గించడం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకున్న తర్వాత విపక్షం చేసే విమర్శలకు విలువలేకుండా పోయిందని, దాని మూలంగా టీడీపీ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కకపోవడమే టీడీపీ వ్యూహాల వైఫల్యంగా అంతా భావిస్తున్నారు.

    Tags  

    • AP Assembly
    • N.Chandrababu Naidu
    • TDP

    Related News

    మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కి దగ్గరవుతున్న చంద్రబాబు!

    మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కి దగ్గరవుతున్న చంద్రబాబు!

    స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ని త్వరలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కలవబోతున్నాడనే వార్త బలంగా వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. అవసరానికి తమ హీరోని వాడుకొని వదిలేస్తారు, తర్వాత ఆయననే విమర్శిస్తారు.. ఇదంతా మాకు, మా హీరోకి అవసరమా అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేశాడు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు […]

    5 months ago
    పల్నాడు పై పచ్చ కన్ను, కుయుక్తులతో, అలజడులతో టీడీపీ బలపడే యత్నాలు

    పల్నాడు పై పచ్చ కన్ను, కుయుక్తులతో, అలజడులతో టీడీపీ బలపడే యత్నాలు

    5 months ago
    ఈమాత్రం దానికి పాదయాత్ర ఎందుకు లోకేష్?

    ఈమాత్రం దానికి పాదయాత్ర ఎందుకు లోకేష్?

    6 months ago
    టీడీపీకి అధికారం కలే అని సొంత వర్గాలే ఫిక్షయ్యాయా?

    టీడీపీకి అధికారం కలే అని సొంత వర్గాలే ఫిక్షయ్యాయా?

    6 months ago
    బాబు హయంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలపై ఈడీ కొరడా

    బాబు హయంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలపై ఈడీ కొరడా

    6 months ago

    తాజా వార్తలు

    • Hastinarealty యాదాద్రి, షాద్ న‌గ‌ర్ , కడ్తాల్ టౌన్ ల్లో HMDA ఎప్రూవ్డ్ ల‌గ్జ‌రీ రెసిడెన్షియ‌ల్ ప్లాట్స్ , రియాల్టీలో హ‌స్తిన కొత్త ట్రెండ్
      4 months ago
    • ఏజెంట్ ఇన్ – భోళాశంకర్ డ్రాప్
      4 months ago
    • గీత గోవిందం 2 ప్లానింగ్ నిజమేనా?
      4 months ago
    • రూటు మార్చిన శర్వానంద్
      4 months ago
    • ప్రచారానికి చెక్ పెట్టిన సమంతా
      4 months ago
    • ఓటిటి హక్కులకే 80 కోట్లా?
      4 months ago
    • ఆర్ఆర్ఆర్ కెజిఎఫ్ స్థాయిలో దసరా ఉంటుందా?
      4 months ago

    సంఘటనలు వార్తలు

    • ఫిబ్రవరిలో మీడియం సినిమాల హంగామా
      4 months ago
    • ప‌వ‌న్ పిల్ల‌ల ఫీజులు క‌ట్టుకోలేరా?
      4 months ago
    • రామ్ చరణ్ సూర్య కాంబోలో మల్టీస్టారర్ ?
      4 months ago
    • షాకింగ్ పాత్రల్లో కాజల్ శ్రీలీల
      4 months ago
    • పఠాన్ విజయానికి 5 కారణాలు
      4 months ago
    • ఆన్ లైన్ గొడవలతో సాధించేది ఏముంది?
      4 months ago
    • బుట్టబొమ్మలో ప్రేమే కాదు సస్పెన్సూ ఉంది
      4 months ago

    News

    • Box Office
    • Movies
    • Events
    • Food
    • Popular Social Media
    • Sports

    News

    • Reviews
    • Spot Light
    • Gallery
    • USA Show Times
    • Videos
    • Travel

    follow us

    • Facebook
    • Twitter
    • YouTube
    • Instagram
    • about us
    • Contact us
    • Privacy
    • Disclaimer

    Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.