• Home
  • తాజా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • సినిమా వార్తలు
  • Nostalgia
  • ఫోటో గ్యాలరీ
  • రివ్యూస్
  • వీడియోలు
  • ID Exclusive
      Home » News » ఉద్ధవ్‌ సర్కార్‌ కూలిపోతుందా..? 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారా..?

      ఉద్ధవ్‌ సర్కార్‌ కూలిపోతుందా..? 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారా..?

      • By Karthik P Updated On - 06:16 PM, Sat - 19 March 22 IST
      ఉద్ధవ్‌ సర్కార్‌ కూలిపోతుందా..? 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారా..?

      మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉందా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఎంవీఏకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్‌లో ఉన్నారంటూ కేంద్ర మంత్రి రావుసాహెబ్‌ దన్వే మాట్లాడడంతో ఈ సందేహాలు మొదలయ్యాయి. ఏ క్షణమైనా ప్రభుత్వాన్ని కూల్చేస్తామనేలా కేంద్ర మంత్రి మాటలు ఉండడం ఎంవీఏ ప్రభుత్వాన్ని కూల్చడంపై బీజేపీ దృష్టి పెట్టిందా..? అనే అనుమానాలు మరోసారి నెలకొన్నాయి.

      2019 అక్టోబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 288 సీట్లు ఉన్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు కావాలి. అయితే నాలుగు ప్రధానపార్టీలకు ఆ మెజారిటీ రాలేదు. బీజేపీకి 105, శివసేనకు 56, నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)కి 54, కాంగ్రెస్‌ పార్టీకి 44 సీట్లు వచ్చాయి. అంతకు ముందు ఐదేళ్లు బీజేపీ, శివసేనలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీ 122 సీట్లు గెలుచుకోవడంతో 63 సీట్లు ఉన్న శివసేనతో కలిసి సర్కార్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ కొనసాగారు. అయితే 2019లో పరిస్థితి తిరగబడింది. బీజేపీకి సీట్లు తగ్గడంతో.. ముఖ్యమంత్రి పదవి పంపకంపై శివసేన పట్టుబట్టింది. చెరో రెండున్నరేళ్ల చొప్పన ముఖ్యమంత్రి పదవి పంచుకోవాలని శివసేన డిమాండ్‌ చేయగా.. ఆ ప్రతిపాదనకు బీజేపీ ఒప్పుకోలేదు.

      ఈ నేపథ్యంలో కొన్నిరోజుల పాటు ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్థత నెలకొంది. శివసేన పట్టు వీడకపోవడంతో బీజేపీ, ఎన్‌సీపీలో చీలిక తెచ్చేందుకు యత్నించింది. అజిత్‌ పవార్‌ను దగ్గరకు తీసుకుని, ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది. అజిత్‌ పవార్‌పై ఉన్న కేసులను అప్పటికప్పుడు ఎత్తివేసింది. అయితే ప్రమాణస్వీకారం రోజున బీజేపీకి షాక్‌ తగిలింది. అజిత్‌ పవార్‌ తిరిగి తన పెదనాన్న శరద్‌పవార్‌ వద్దకే వెళ్లిపోయారు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే బీజేపీ ఆలోచనకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ పరిణామం తర్వాత శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు మహా వికాస్‌ అఘాడీ (వీఎంఏ) పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. సీఎం పదవి శివసేనకు ఇచ్చేలా, అధికారం మూడు పార్టీలు పంచుకునేలా ఒప్పందం జరగడంతో.. మహా రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది.

      105 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా అధికారం దక్కించుకోలేకపోవడంతో బీజేపీ రగిలిపోతోంది. ముఖ్యంగా తన పాత మిత్రడు అయిన శివసేన పై అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం కూలిపోతే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఊవ్విళ్లూరుతోంది. పలుమార్లు కూటమిలోని పార్టీల మధ్య మనస్పర్థలు రాగా ప్రభుత్వం పడిపోతుందని ఆశించింది. అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండానే ఉద్ధన్‌ ఠాక్రే నేతృత్వంలోని ఎంవీఏ కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

      కూటమిలోని ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ నేతలు మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. బీజేపీ నేతలు తరచూ ఇలాంటి బెదిరింపులు చేస్తూనే ఉన్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో మాదిరిగా అధికార పార్టీలలోని ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలోకి రావడం వల్ల మహారాష్ట్రలోనూ ప్రభుత్వం కూలిపోతుందని అందరూ భావించారు. అయితే బీజేపీ వ్యూహాలు మహారాష్ట్రలో పనిచేయడం లేదు. ఇప్పుడు కేంద్ర మంత్రి రావుసాహెబ్‌ దన్వే చేసిన వ్యాఖ్యలు కూడా ఎంవీఏ కూటమిని ఆందోళనకు గురిచేసేదే కానీ.. మంత్రి చెప్పిన మాటలు నిజం అయ్యే అవకాశాలు ఎంత వరకు ఉంటాయనేది ప్రశ్నార్థకమే.

      Tags  

      • Central Minister Raosaheb Danve
      • CM Uddhav Thackeray
      • Maharastra
      • Maharastra Governament
      • MVA Governament

      Related News

      రాజ్ థాక‌రే పార్టీలో ఏకనాథ్ షిండే వ‌ర్గం విలీనం? మ‌హారాజ‌కీయాల్లో కొత్త ట్విస్ట్

      రాజ్ థాక‌రే పార్టీలో ఏకనాథ్ షిండే వ‌ర్గం విలీనం? మ‌హారాజ‌కీయాల్లో కొత్త ట్విస్ట్

      తిరుగుబాటు చేసినంత హుషారుగా ఇప్పుడు, తదుప‌రి కార్య‌చ‌ర‌ణ గురించి శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆలోచించ‌లేక‌పోతున్నారు. కాని మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై స్పందించేందుకు, సుప్రీంకోర్టు జూలై 12 వరకు గడువు ఇవ్వడంతో, ఏక్‌నాథ్ షిండే వర్గానికి రెండువారాలు ఊపిరి పీల్చుకోవ‌చ్చు. కాస్తంత వెసులుబాటైతే దొరికిందికాని, ఏం చేయాల‌న్న‌ది దానిమీద క్లారిటీ లేదు. ఇదో పెద్ద వ్యూహాత్మ‌క గంద‌ర‌గోళం. ఇంత‌కీ వేరే పార్టీలో విలీనం కావాలా లేదంటే తమదే నిజమైన శివసేన అని […]

      11 months ago
      సూట్ కేసులతో సహా బంగ్లాను ఖాళీ చేసిన ఉద్ధవ్ ఠాక్రే

      సూట్ కేసులతో సహా బంగ్లాను ఖాళీ చేసిన ఉద్ధవ్ ఠాక్రే

      12 months ago
      Eknath Shinde ఏక్‌నాథ్ షిండే ఎవరు? ఒక‌నాటి ఆటోడ్రైవ‌ర్ మ‌హా స‌ర్కార్ ను కూల్చేస్తారా?

      Eknath Shinde ఏక్‌నాథ్ షిండే ఎవరు? ఒక‌నాటి ఆటోడ్రైవ‌ర్ మ‌హా స‌ర్కార్ ను కూల్చేస్తారా?

      12 months ago
      మహా విషాదం.. ఒకేసమయంలో అన్నదమ్ముల కుటుంబాలు ఆత్మహత్యలు.. వీడిన మిస్టరీ

      మహా విషాదం.. ఒకేసమయంలో అన్నదమ్ముల కుటుంబాలు ఆత్మహత్యలు.. వీడిన మిస్టరీ

      12 months ago
      54 రూపాయలకే లీటర్ పెట్రోల్.. ఎగబడ్డ జనం..

      54 రూపాయలకే లీటర్ పెట్రోల్.. ఎగబడ్డ జనం..

      12 months ago

      తాజా వార్తలు

      • Hastinarealty యాదాద్రి, షాద్ న‌గ‌ర్ , కడ్తాల్ టౌన్ ల్లో HMDA ఎప్రూవ్డ్ ల‌గ్జ‌రీ రెసిడెన్షియ‌ల్ ప్లాట్స్ , రియాల్టీలో హ‌స్తిన కొత్త ట్రెండ్
        4 months ago
      • ఏజెంట్ ఇన్ – భోళాశంకర్ డ్రాప్
        4 months ago
      • గీత గోవిందం 2 ప్లానింగ్ నిజమేనా?
        4 months ago
      • రూటు మార్చిన శర్వానంద్
        4 months ago
      • ప్రచారానికి చెక్ పెట్టిన సమంతా
        4 months ago
      • ఓటిటి హక్కులకే 80 కోట్లా?
        4 months ago
      • ఆర్ఆర్ఆర్ కెజిఎఫ్ స్థాయిలో దసరా ఉంటుందా?
        4 months ago

      సంఘటనలు వార్తలు

      • ఫిబ్రవరిలో మీడియం సినిమాల హంగామా
        4 months ago
      • ప‌వ‌న్ పిల్ల‌ల ఫీజులు క‌ట్టుకోలేరా?
        4 months ago
      • రామ్ చరణ్ సూర్య కాంబోలో మల్టీస్టారర్ ?
        4 months ago
      • షాకింగ్ పాత్రల్లో కాజల్ శ్రీలీల
        4 months ago
      • పఠాన్ విజయానికి 5 కారణాలు
        4 months ago
      • ఆన్ లైన్ గొడవలతో సాధించేది ఏముంది?
        4 months ago
      • బుట్టబొమ్మలో ప్రేమే కాదు సస్పెన్సూ ఉంది
        4 months ago

      News

      • Box Office
      • Movies
      • Events
      • Food
      • Popular Social Media
      • Sports

      News

      • Reviews
      • Spot Light
      • Gallery
      • USA Show Times
      • Videos
      • Travel

      follow us

      • Facebook
      • Twitter
      • YouTube
      • Instagram
      • about us
      • Contact us
      • Privacy
      • Disclaimer

      Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.