iDreamPost
iDreamPost
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కరోనా భారినపడ్డారు. ఇటీవల జరిపిన వైద్యపరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్దారించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యుల్లో పలువురికి కూడా పాజిటివ్‌గా తేలిసింది. ఈ నేపథ్యంలో వారంతా హోమ్ ఐసోలేషన్‌లోనే ఉండి వైద్య సాహాయం పొందుతున్నారు. తనను కలిసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.
కాగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడచిన ఇరవైనాలుగు గంటల్లో మొత్తం 9,999 మంది పాజటివ్‌లుగా తేలిందని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ స్పష్టం చేసింది. మొత్తం 71,137 పరీక్షలు చేయగా వీరిలో తొమ్మిదివేల తొమ్మిది వందల తొంభైతొమ్మిది మందికి పాజిటివ్ వచ్చిందని బులిటెన్‌లో పేర్కొన్నారు. ఏపీలోని 13 జిల్లాల్లోనూ తూర్పుగోదావరి జిల్లా అత్యధికంగా 1,499 పాజిటివ్‌లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత పశ్చిమగోదావరి 1,081, చిత్తూరు 1,041 స్థానాల్లో ఉన్నాయి. కాగా 11,069 మంది పూర్తిగా కోలుకున్నారని ఆ బులిటెన్‌లో పేర్కొన్నారు. 77 మంది కన్నుమూసారన్నారు.ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఏపీలో కోవిడ్ 19 పాజిటివ్‌లు 5,47,686కుచేరాయి. యాక్టివ్ కేసులు 96,191 మాత్రమే ఉన్నాయన్నారు.