iDreamPost
android-app
ios-app

పోలవరానికి రూ. 3 వేల కోట్లు

పోలవరానికి రూ. 3 వేల కోట్లు

పోలవరం ప్రాజెక్టుకు రూ.మూడు వేల కోట్లను విడుదల చేయడంపై కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ శుక్రవారం ప్రతిపాదనలు పంపారు. నవంబర్‌ మొదటి వారంలో నాబార్డ్‌ ద్వారా నిధుల విడుదలకానున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటిదాకా రూ.16,935.6 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు (ఏప్రిల్‌ 1, 2014కు ముందు) రూ.5,135.87 కోట్లను ఖర్చు చేసింది. పోలవరం ప్రాజెక్టును వంద శాతం వ్యయంతో పూర్తి చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చాక ఏప్రిల్‌ 1, 2014 నుంచి ఇప్పటిదాకా రూ.11,799.73 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో రూ.6,727.26 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేయగా రూ.5,072.47 కోట్లను రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. ఇటీవల సీఎం జగన్ ఈ నిధులపై అధికారులతో సమీక్షా నిర్వహాయించారు.