Idream media
Idream media
రెండో ప్రపంచ యుధ్ధంలో రష్యా విజయం సాధించి 75 ఏళ్ళు అయిన సందర్భంగా రాజధాని మాస్కోలో గత నెల 24 న జరిగిన విక్టరీ పరేడ్ కు భారత్ నుంచి త్రివిధ దళాలకు చెందిన సైనిక బృందం వెళ్లిన విషయం విదితమే. తమ దేశం నిర్వహించనున్న పరేడ్ లో పాల్గొనేందుకు ఇండియన్ కంటింజెంట్ ని పంపవలసిందిగా రష్యా భారత ప్రభుత్వాన్ని కోరడంతో మన బృందం అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో… పరేడ్ ను పురస్కరించుకుని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి అభినందన సందేశం పంపిన ప్రధానిమోడీ తాజాగా ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రష్యా నుంచి 33 యుద్ధ విమానాలు భారత్‌కు రానున్నాయి.
చైనాతో సరిహద్దుల వివాదం నేపథ్యంలో మోడీ ఆయనకు ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకుని చేసిన విక్టరీ డే ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడంపై ఫుతిన్ కు ఫోన్ లో అభినందనలు తెలిపారు. అదే సమయంలో మరో 16 సంవత్సరాల పాటు పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉండేలా తాజాగా చేసిన రాజ్యాంగ సవరణ ఆమోదం పొందడంపై కూడా మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
మాస్కోలో ఇటీవల జరిగిన మిలిటరీ పరేడ్‌లో భారత త్రివిధ దళాలు పాల్గొన్న విషయంపై ఇద్దరు నేతలూ మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య పటిష్టమైన బంధానికిది నిదర్శనమన్నారు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న రష్యా-భారత్ ద్వైపాక్షిక సమావేశానికి రావాలని ప్రధాని మోడీ పుతిన్‌కు ఆహ్వానం పలికినట్లు తెలిసింది. భారత్‌కు తామెప్పుడూ అండగా ఉంటామని పుతిన్ వెల్లడించారు. చెప్పినట్లు స్పష్టం చేశారు. 2036 వరకూ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతారు. 83 ఏళ్ల వయసు వచ్చేవరకూ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉంటారు.
16 ఏళ్లు ఆయనే అధ్యక్షుడు..
మరో 16 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే కొనసాగేలా ఆ దేశ రాజ్యాంగంలో సవరణ చేయడం గమనార్హం. దీని కోసం వారం రోజులపాటు ప్రజాభిప్రాయ సేకరణ ఎన్నికలు నిర్వహించారు. బుధవారంతో ఈ ఎన్నికలు ముగిశాయి. 60 శాతం మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజా రాజ్యాంగ సవరణకు అనుకూలంగా 76.9 శాతం మంది ఓటువేసినట్టు రష్యా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో పుతిన్ సుదీర్ఘ కాలం పాటు రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఆయన 2000 సంవత్సరం నుంచి రష్యా అధ్యక్షుడిగా లేదా ప్రధానిగా ఏదో ఓ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం 2024లో ముగియనుంది. కానీ.. రాజ్యాంగ సవరణతో 2036 వరకు ఆయనే అధ్యక్ష పదవిలో కొనసాగుతారు.