ప్రభుత్వం చేస్తున్న మంచిపనులు పవన్ నాయుడికి కనిపించడం లేదని రవాణాశాఖా మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేసారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను ఏనాడూ ప్రశ్నించని పవన్ నాయుడు ఇప్పుడు జగన్ ప్రభుత్వం మంచిపనులు చేస్తుంటే మాత్రం ప్రశ్నిస్తున్నాడని అన్నారు. జగన్ ప్రవేశపెట్టిన మంచి పథకాలు పవన్ నాయుడికి కనిపించవని కేవలం ఇసుక కొరత మాత్రమే పవన్ నాయుడికి కనిపిస్తుందని పేర్కొన్నారు.
జూన్ 25 నుండి గోదావరికి వరదలు వచ్చాయని ఇప్పటికి నీటి ఉదృతి తగ్గలేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ కి పెళ్లిళ్లపై మక్కువ ఉంది కాబట్టి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారని కానీ జగన్ కి ప్రజాసేవ ముఖ్యం కాబట్టి అదే చేస్తున్నారని తెలిపారు. మనం సూక్తిముక్తావళి చెప్పేముందు వాటిని మనం కూడా పాటించాలని విమర్శించారు.
విధ్యార్థుల తలరాతని మార్చే నిర్ణయం జగన్ ప్రభుత్వం తీసుకుంటే దుర్మార్గపు విమర్శలెందుకు అని ప్రశ్నించారు. తెలుగు సబ్జెక్టును తీసేయలేదని ఇంగ్లీష్ మీడియంలో చదివితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు.