2019 సార్వత్వర ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత తొలి సారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీమ పరిధిలోని చిత్తూరు, కడప జిల్లాలలో పర్యటించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగిస్తారు. డిసెంబర్ ఒకటవ తేదీ పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పరిధిలోని రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి పార్టీ శ్రేణులతో కలసి రోడ్డు మార్గంలో బయల్దేరి మద్యాహ్నం 3.30 గంటలకు కడప జిల్లా రైల్వే కోడూరు చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుండి తిరుపతికి బయల్దేరి వెళ్తారు. రాత్రి తిరుపతి లోని కెన్సెస్ హోటల్ లో బస చేయనున్నారు. సోమవారం (2వ తేదీ) ఉదయం కెన్సేస్ హోటల్ లో చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ ఇంఛార్జి లు, పార్టీ కార్య కర్తలతో సమావేశమై భవిషత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. కాగా మంగళవారం ఉదయం కడప, రాజంపేట పార్లమెంట్ ఇంఛార్జి లు, పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు సమావేశం లో భవిషత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
బుధవారం ఉదయం తిరుపతి నుండి బయల్దేరి బాకరపేట, పీలేరు మీదుగా మదనపల్లె చేరుకుంటారు. మధ్యాహ్నం మదనపల్లె లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశం లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడినుండి హార్సిలీ హిల్స్ కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా గురువారం ఉదయం తిరిగి మదనపల్లె చేరుకుని అక్కడ పార్టీ నాయకులు గంగారపు రాందాస్ చౌదరీ ఇంట్లో ఏర్పాటు చేసిన తేనీటి విందు లో పాల్గొంటారు. అనంతరం మదనపల్లె లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో అనంతపురం, హిందూపురం పార్లమెంట్ ఇంఛార్జి లు, పార్టీ కార్యకరతలతో సమావేశమై పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. పవన్కళ్యాణ్ వెంట నాదెళ్ల మనోహర్ తో పాటు ఇతర పార్టీ శ్రేణులు పాల్గొననున్నారు.