iDreamPost
android-app
ios-app

పవన్ బాలయ్య ములాఖత్ – టాక్ అఫ్ ది సోషల్ మీడియా

  • Published Dec 27, 2022 | 5:39 PM Updated Updated Dec 27, 2022 | 5:39 PM
పవన్ బాలయ్య ములాఖత్ – టాక్ అఫ్ ది సోషల్ మీడియా

ఇవాళ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ బాలకృష్ణల టాక్ షో గురించిన చర్చ వాటి తాలూకు ఫోటోలతోనే హడావిడి జరుగుతోంది. ఆహా చేస్తున్న అన్ స్టాపబుల్ కోసం ఇవాళ పవర్ స్టార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎపిసోడ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో తీస్తున్నారు. దీనికి త్రివిక్రమ్ కూడా హాజరయ్యారు. ఈ వార్త ఎప్పుడో లీకైనప్పటికీ ఫైనల్ గా అనుకున్న డేట్ కే ప్లానింగ్ ప్రకారం చిత్రీకరణ పూర్తి చేశారు. ఇటీవలే ప్రభాస్ ది కేవలం ప్రోమోతోనే ఎంత సెన్సేషన్ అయ్యిందో చూస్తున్నాం. అసలు భాగం డిసెంబర్ 30న స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యంలో దాని మీద ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏదో సినిమా రేంజ్ లో హైప్ నడుస్తోంది

ఇక పవన్ వస్తే రచ్చ ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. ఇటీవలి కాలంలో కొణిదెల నందమూరి కుటుంబాల కాంబోలు తరచుకోగా జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ లో నటించడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు దీనికి శ్రీకారం చుట్టారు. అది అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు బాలయ్య పవన్ లు చేస్తోంది సినిమా కాకపోయినా ఇంత సేపు సుదీర్ఘంగా ఈ ఇద్దరూ మాట్లాడుకున్నది గతంలో లేదు కాబట్టి ఇది సంథింగ్ స్పెషల్ గానే చెప్పుకోవాలి. ఇండస్ట్రీ ముచ్చట్లతో పాటు టిడిపితో జనసేన పొత్తు, చిరంజీవికి సంబంధించిన విషయాలు డిస్కషన్ లో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి లీక్స్ బయటికి రాలేదు.

సాయిధరమ్ తేజ్ తో వీడియో కాల్ తో పాటు మరికొన్ని ఆకర్షణలు ఇందులో చోటు చేసుకోబోతున్నాయి. ఇది సంక్రాంతి తర్వాత స్ట్రీమింగ్ చేయొచ్చని ఇన్ సైడ్ టాక్. ప్రభాస్, పవన్ ల ఎపిసోడ్స్ మీద ఆహాకు భారీ అంచనాలు ఉన్నాయి. వీటితోనే సబ్స్క్రిప్షన్ లు అమాంతం పెరుగుతాయని ఎదురు చూస్తోంది. కొత్త సినిమాలు ఎన్ని ఇచ్చినా రాని హైప్ ఈ షో తేవడం వెనుక అల్లు అరవింద్ ప్లానింగ్ చాలానే దోహదపడింది. చిరంజీవి నాగార్జున వెంకటేష్ లాంటి బాలయ్య సమకాలీకులు వస్తారనే ప్రచారం జరిగింది కానీ ప్రస్తుతానికి ఆ సూచనలు లేవు. పవన్ తోనే సెకండ్ సీజన్ ని ముగించి మూడో సిరీస్ కి కొత్త సెలబ్రిటీలను తీసుకొచ్చే ప్లాన్ ఉందట

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet