కరోనా నివారణకు పవన్ కళ్యాణ్ 2 కోట్ల విరాళం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా వైరస్ పై దేశం చేస్తున్న పోరుకు తన వంతు సాయంగా 2 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.
ప్రధానమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి చెరో 50 లక్షల చొప్పున విరాళం ప్రకటిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గతంలో కూడా పలుసార్లు పవన్ కళ్యాణ్ తన దాతృత్వాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా వైరస్ ధాటికి వణుకుతున్నాయి. దాంతో దేశం మొత్తం లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.