iDreamPost
android-app
ios-app

అజ్ఞాత‌వాసిలో ప‌వ‌న్ పాత్ర పేరు ఏబీ

  • Published Jan 05, 2018 | 2:34 AM Updated Updated Jan 05, 2018 | 2:34 AM
అజ్ఞాత‌వాసిలో ప‌వ‌న్ పాత్ర పేరు ఏబీ

తెలుగు ప్రేక్ష‌కులు ఇప్పుడు అత్యంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సినిమా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కల్యాణ్‌- టాప్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ల కాంబోలో వ‌స్తున్న ‘అజ్ఞాత‌వాసి’ .  ఈ చిత్రంలోని ’కొడుకా.. కోటేశ్వ‌ర్రావు’ అనే పాట ఇప్పుడు ఎక్క‌డ‌చూసినా యువ‌త పెదాల‌పై నాట్యం చేస్తోంది. ఇక సంక్రాంతి సీజ‌న్‌పై గ‌తంలో అంత‌గా గురిపెట్ట‌ని ప‌వ‌న్ ఈసారి తానూ బ‌రివ‌లోకి దిగుతుండ‌టంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పండ‌గ సంద‌డి మ‌రింత పెర‌గ‌నుంద‌న్న‌మాట‌. 

ఇక ఈ చిత్రంలో ప‌వ‌ర్‌స్టార్ పాత్ర‌ను అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించేలా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ తీర్చిదిద్దిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిలో వ‌చ్చిన ’జ‌ల్సా’మంచి విజ‌యం సాధించ‌గా, ’అత్తారింటికి దారేది’  చిత్ర‌మైతే అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే..! ఈ నేప‌థ్యంలో తాజా చిత్రం ‘అజ్ఞాత‌వాసి’పై ఇప్ప‌టికే అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి.

కాగా ఈ మూవీలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించే పాత్ర పేరు ఏబీ అంటే అభిషిక్త్ భార్గ‌వ అని తెలుస్తోంది. మొద‌టినుంచి త్రివిక్ర‌మ్ త‌న సినిమాల్లో హీరో పేర్ల‌కు ఆస‌క్తిక‌రంగా క్యాచీగా ఉండే పేర్లు పెడుతూ రావ‌డం ఆన‌వాయితీ వ‌స్తోంది.  ‘అత‌డు‘ సినిమాలో హీరో మ‌హేష్‌కు పార్థు, నందూ అనే పేర్లుంటాయి. ఇక ప‌వ‌న్ పేరు ‘జల్సా’ సినిమాలో  సంజయ్‌ సాహు. ‘అత్తారింటికి దారేది’లో గౌతం నంద. ‘జులాయి’లో అల్లు అర్జున్‌ పేరు రవీంద్ర నారాయణ్‌. ఇదే క్ర‌మంలో తాజాగా రాబోతున్న ‘అజ్ఞాతవాసి’ సినిమాలో పవన్ పాత్రకు అభిషిక్త్‌ భార్గవ అని పేరు పెట్టారట. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల‌ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో అను ఇమ్మా్న్యుయేల్‌, కీర్తి సురేశ్  ప‌వ‌ర్‌స్టార్ స‌ర‌స‌న కథానాయికలుగా మెర‌వ‌నున్న విష‌యం తెలిసిందే..!

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetMeritkingTimebetGrandpashabetGrandpashabetcasibombetpark girişrobinbetjojobet girişslot siteleriMadridbetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş