iDreamPost
android-app
ios-app

నాడు-నేడు ప్రభావం: ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల వైపుకి విద్యార్థులు

  • Published Nov 22, 2020 | 4:14 AM Updated Updated Nov 22, 2020 | 4:14 AM
  • Published Nov 22, 2020 | 4:14 AMUpdated Nov 22, 2020 | 4:14 AM
నాడు-నేడు ప్రభావం: ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల వైపుకి విద్యార్థులు

ఏపీలో ప్రభుత్వ బడులకు మళ్లీ పూర్వ వైభవం ఖాయంగా కనిపిస్తోంది. చాలాకాలం తర్వాత సర్కారీ స్కూళ్ళలో చేరికలు పెరిగాయి. గడిచిన రెండు దశాబ్దాలుగా అవుట్ గోయింగ్ తప్ప ఇన్ కమింగ్ పెద్దగా కనిపించేది కాదు. దాంతో అనేక బడులు మూతపడ్డాయి. కేవలం విద్యార్థులు లేని కారణంగా కొన్ని స్కూళ్లు మూతపడ్డాయి. పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చమని పంతుళ్లు ఇంటింటికీ తిరిగే కార్యక్రమాలు చేసినా ఫలితాలు కనిపించేవి కాదు. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది పునరుత్తేజం కల్పించేలా కనిపిస్తోంది.

జగన్ ప్రభుత్వం చెప్పింది చేస్తున్న కారణంగా ప్రభుత్వ విద్యారంగం మళ్లీ గాడిన పడుతోంది. శ్రీచైతన్య, నారాయణ సహా కార్పోరేట్ విద్యాసం స్థల చేతుల్లోంచి ఉపశమనం దక్కుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే రెండున్నర లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో కొత్తగా చేరారు. వారిలో అత్యధికులు ప్రైవేటు స్కూళ్ళ నుంచి వచ్చి చేరుతున్న వారే కావడం విశేషం. అంటే రివర్స్ మైగ్రేషన్ మొదలయినట్టేనని చెప్పవచ్చు. ఇకప్పుడు ప్రభుత్వ బడుల్లో చదువులు సరిగా లేవని ప్రైవేటు స్కూళ్ళను ఆశ్రయించిన తల్లిదండ్రులు ఇప్పుడు మళ్లీ తమ పిల్లలను ప్రభుత్వ బడులకు తోలుతున్న దృశ్యాలు ఆసక్తికరం.

కార్పోరేట్ విద్యారంగం కారణంగా సమాజంలో పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కొత్తతరంలో సామాజిక చైతన్యం పూర్తిగా సన్నగిల్లిందనే వారు కూడా ఉన్నారు. యువత వేగంగా పక్కదారి పట్టేందుకు బట్టీ విద్యా విధానం తోడ్పడిందనే ఆందోళనలు వినిపించాయి. వాటన్నటింకీ ఫుల్ స్టాప్ పెట్టేలా ప్రభుత్వ విద్యారంగాన్ని మళ్లీ పట్టాలెక్కించే బాధ్యతను జగన్ ప్రభుత్వం తీసుకున్నట్టే చెప్పవచ్చు. వరుసగా వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. నాడు- నేడు పథకంలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. అనేక చోట్ల ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిపోయాయి. కార్పోరేట్ స్కూళ్లను తలదన్నేలా కనిపిస్తున్నాయి. అంతేగాకుండా అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన వంటి కార్యక్రమాలు విద్యారంగాన్ని పట్టాలెక్కించాయి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుముద్ద పేరుతో రుచికరమైన ఆహారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మార్పులన్నీ కలిసి ప్రభుత్వ విద్యారంగంలో పెను మార్పులు తెస్తున్నట్టు చెప్పవచ్చు.

విద్యాశాఖలో ప్రస్తుతం వాడ్రేవు చినవీరభద్రుడు, అక్నూరు మురళి వంటి అత్యుత్తమ అధికారుల పర్యవేక్షణ దానికి తోడ్పడుతోంది. ముఖ్యమంత్రి మార్గదర్వకత్వంలో అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. సామాజిక స్పృహ కలిగిన అధికారులు ప్రాధమిక విద్యారంగం ప్రాధాన్యతను గుర్తించి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియంలో బోధనకు ప్రభుత్వం పట్టుదలతో చేసిన ప్రయత్నాల మూలంగా ప్రైవేటు స్కూళ్లకు, ప్రభుత్వ బడులకు ఉన్న వైరుధ్యం పూర్తిగా తొలగిపోయింది. మరిన్ని సదుపాయాలు లభించే ప్రభుత్వ బడులకు అందరూ మొగ్గుచూపేందుకు దోహదపడింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య 42.46 లక్షలకు చేరింది. 2019లో అది 39.74 లక్షలు మాత్రమే. అంటే ఒక్క విద్యాసంవత్సరంలో 2.6లక్షలు కొత్తగా వచ్చి చేరారు. రాబోయే కాలంలో మరింత మంది ప్రభుత్వ బడులకు పయనం కట్టడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

తద్వారా దిగువ మధ్యతరగతికి ఎంతో ఊటర కలగబోతోంది. ఇద్దరు పిల్లలున్న కుటుంబంలో ప్రాధమిక విద్యకు ప్రైవేటు బడుల్లో కనీసంగా ఫీజులు, పుస్తకాలు కలిపి రూ. 50వేలు ఏటా వ్యయం చేయాల్సి వచ్చేది. అంటే నెలకు రూ. 4వేలకు పైగా ఇప్పుడు వ్యయం ఆదా అవుతుంది. అంతేగాకుండా మధ్యాహ్న భోజనం, విద్యాకానుకలో యూనిఫాం సహా ఇతర సదుపాయాలు అదనం. దాంతో ఆయా కుటుంబాల్లో మిగులు ఆదాయం ఇతర మార్గాల్లో వెచ్చించడానికి దోహదపడుతుంది. తద్వారా వారు అభివృద్ధి పథంలో పయనించేందుకు దారితీస్తుంది. ఇలాంటి సామాజిక మార్పునకు ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలు పునాదిగా మారుతున్నాయి. ఇక త్వరలో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ ప్రకటించారు. అది కూడా జరిగితే కేరళ, ఢిల్లీ తరహా అందరికీ ఆదర్శనీయ విద్యారంగం ఆంధ్రప్రదేశ్ లో చూడవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet