ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సామాన్య ప్రజలకే కాకుండా ప్రముఖ క్రీడాకారులకు కూడా సోకుతుంది. ఇప్పటికే పలువురు పాక్ క్రికెటర్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్‌కు కరోనా సోకింది.
వివరాల్లోకి వెళితే ఇటీవల సెర్బియా, క్రొయేషియాలో జరిగిన టెన్నిస్ ఎగ్జిబిషన్ సిరీస్‌లో జకోవిచ్ పాల్గొన్నాడు. కాగా ఒక ఆటగాడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో టోర్నీని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ టోర్నీలో పాల్గొన్న జకోవిచ్ స్వీయ జాగ్రత్తలు తీసుకోకుండా సహచర ఆటగాళ్లను కౌగలించుకోవడం, వారితో కలిసి నృత్యం చేయడం,బాస్కెట్ బాల్ ఆడటం లాంటివి చేయడం ద్వారా అతనికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది.
జకోవిచ్ తో పాటుగా అతని భార్యకు కూడా ఈ వ్యాధి సోకినట్లు జకోవిచ్ స్వయంగా ప్రకటించారు.బెల్‌గ్రేడ్‌కు వచ్చిన వెంటనే కరోనా పరీక్షలు చేయించుకున్నాం అని తనకి తన భార్య జెలెనా రిస్టిక్‌కు కరోనా పాజిటివ్ అని తేలిందని 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నామని జకోవిచ్ వెల్లడించాడు. కాగా తనలో కోవిడ్ లక్షణాలు ఏవి బయటపడలేదని కానీ టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ అని తేలిందని జకోవిచ్ తెలిపాడు.