ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించడం లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి, రీజనల్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “ప్రశాంత్ కిషోర్‌తో సీఎం వైఎస్ జగన్‌కి వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. 2019 ఎన్నికల్లో ఆయన మాతో కలిసి పనిచేశారు. తరువాత ప్రశాంత్ కిషోర్ మాతో పనిచేయడం లేదు. భవిష్యత్‌లో పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చు” అని చెప్పారు.
ఏ పార్టీ తోనూ తమకు పొత్తు ఉండదని సజ్జల స్పష్టం చేశారు. “మాకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ మాకు పొత్తు ఉండదు. ఒంటరిగానే పోటీచేయాలన్నది సీఎం వైఎస్ జగన్ సిద్ధాంతం. మాతో పొత్తు పెట్టుకోవాలని చాలా పార్టీలు అనుకోవచ్చు. కానీ సీఎం జగన్ ఎప్పుడూ పొత్తుల్లేకుండానే రాజకీయం చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.
టీడీపీ ఆందోళనలకు పిలుపునివ్వడం హాస్యాస్పదమని సజ్జల అన్నారు. “మహిళలకు ఎన్నడూలేని సాధికారత, భద్రత అందిస్తున్నాం.సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళాభాగస్వామ్యం అత్యధికం. ప్రజలు టీడీపీ చేసే నిరసనలు నమ్మరు” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
73257