iDreamPost
android-app
ios-app

పెళ్లికొడుకు కాబోతున్న కుర్రహీరో ? 

  • Published Feb 02, 2020 | 4:12 PM Updated Updated Feb 02, 2020 | 4:12 PM
పెళ్లికొడుకు కాబోతున్న కుర్రహీరో ? 

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన నిఖిల్ త్వరలో పెళ్లి కొడుకుగా మారబోతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు నిఖిల్ తో కొన్నేళ్ల నుంచి స్నేహ బంధంలో ఉన్న పల్లవి వర్మతో నిన్న నిశ్చితార్థం జరిగినట్టు సమాచారం. ఇది మీడియాకు ఇండస్ట్రీ వర్గాలకు దూరంగా ఫ్యామిలీ ఈవెంట్ గా చేసినట్టుగా తెలిసింది. పల్లవి వర్మ వృత్తిరీత్యా డాక్టర్. వైద్య వృత్తిలో ఉన్న పల్లవితో నిఖిల్ రిలేషన్ గురించి కొన్ని నెలల క్రితమే కథనాలు వచ్చాయి. 

నిఖిల్ ఆ సమయంలో పూర్తిగా కొట్టివేయలేదు కానీ టైం వచ్చినప్పుడు అందరికి చెప్తానని దాటేశాడు. ఇప్పుడు ఆ ఘడియలు వచ్చేశాయి. ఏప్రిల్ 16 పెళ్లి ముహూర్తంగా ఫిక్స్ చేసినట్టుగా ఇన్ సైడ్ టాక్. పూర్తి వివరాలు నిఖిల్ అధికారికంగా వెల్లడిస్తాడేమో వేచి చూడాలి. గత రెండేళ్లుగా అర్జున్ సురవరం రిలీజ్ కోసం ఎదురు చూసిన నిఖిల్ దానికి తగ్గట్టే మంచి ఫలితాన్నే అందుకున్నాడు. డీసెంట్ హిట్ గా నిలిచి వసూళ్లు బాగానే రాబట్టింది. 
దీని తర్వాత కార్తికేయ 2 కోసం ప్లానింగ్ లో ఉన్నాడు నిఖిల్. ఇప్పటికే చందు మొండేటి స్క్రిప్ట్ సిద్ధం చేసే పని లో ఉన్నాడట. కిరాక్ పార్టీ ఫెయిల్ అయ్యాక నిఖిల్ కు గ్యాప్ వచ్చింది. అర్జున్ సురవరం టైంకి పూర్తయినా ఏవో కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. పెళ్ళికి కొన్ని నెలల ముందు సినిమా సక్సెస్ కావడం, కొత్త ఏడాదిలో ఓ ఇంటివాడిగా మారనుండటం నిఖిల్ కు అన్ని శుభ శకునాలుగా ఉన్నట్టున్నాయి. ఇదంతా అఫీషియల్ గా నిఖిల్ ఎప్పుడు చెప్తాడో వేచి చూడాలి మరి

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetmadridbetmeritbetMarsbahis GirişCasibom Girişcasinoroyalmeritbet