iDreamPost
android-app
ios-app

పెళ్లైన 45 రోజులకే భార్య నాలుగు నెలల గర్భవతి అని తెలిసి..

  • Published Jun 24, 2022 | 4:42 PM Updated Updated Jun 24, 2022 | 4:42 PM
పెళ్లైన 45 రోజులకే భార్య నాలుగు నెలల గర్భవతి అని తెలిసి..

పెళ్లైన 45 రోజులకే భార్య నాలుగు నెలల గర్భవతి అని తెలిసి.. భర్త, అత్తమామలు షాకయ్యారు. తాము మోసపోయామని గ్రహించి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో వెలుగుచూసింది. కొత్తకోడలు తరచూ కడుపునొప్పి అని ఏడుస్తుండటంతో.. అత్తమామలు ఆమెను సోనోగ్రఫీ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. నవవధువును పరీక్షించిన వైద్యులు ఆమె నాలుగునెలల గర్భవతి అని చెప్పడంతో, అత్తమామలు షాకయ్యారు. ఈ విషయం తెలిసిన భర్త ఆమెను తన గ్రామానికి తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. ఆపై తాను మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తమ గ్రామానికి చెందిన బంధువు ద్వారా నెలన్నర క్రితం ఆమెను వివాహం చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెళ్లి చేసుకుని, చక్కగా జీవితంలో స్థిరపడాలనుకున్న తనను వధువు కుటుంబీకులు దారుణంగా మోసం చేశారని, ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం ముందే తెలిసినా దాచిపెట్టి తనకిచ్చి పెళ్లిచేశారని వాపోయాడు. బాధిత భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాజస్థాన్ లో జరిగిన మరో ఘటనలో.. వరుడిపై కోపగించుకున్న వధువు మరో యువకుడిని పెళ్లాడింది. చురు జిల్లాలో వరుడు పెళ్లి బారాత్ లో ఫుల్లుగా తాగి డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. రాత్రి 9 గంటలకు వధువు ఇంటికి చేరుకోవాల్సి ఉండగా.. ఎంతకూ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు.. కుటుంబ సభ్యుల సూచనతో మరో యువకుడిని పెళ్లాడింది. దాంతో వరుడి తరపు బంధువులు రాజ్ గఢ్ పోలీస్ స్టేషన్లో వధువు కుటుంబంపై ఫిర్యాదు చేశారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş