Idream media
Idream media
పాత సంవత్సరం ముగింపు, కొత్త ఏడాది ప్రారంభంలో యువతకు హైద్రాబాద్ పోలీసులు షాకిచ్చారు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా జరగనున్న ఈవెంట్లకు, వేడుకలకు సింగిల్స్‌కి ఎంట్రీ లేదని చెప్పారు. కపుల్ ఎంట్రీస్ కానీ లేదా బంధువులతో కానీ ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొనాలని పోలీసులు సూచించారు.
హైదరాబాద్ నగరవ్యాప్తంగా న్యూయర్ సన్నాహాలకు యువత ఇప్పటికే సిద్ధమవుతోంది. పబ్‌లు, రెస్టారెంట్‌లు అదిరిపోయే ఆఫర్లతో రెడీ అయిపోయాయి. సాధారణంగా… యువత కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, డిసెంబరు 31 నుంచీ పబ్‌ల్లో, రోడ్లమీద వేడుకలను, సంబరాలను చేసుకుంటుంటారు. అయితే ఈ వేడుకల్లో మహిళల సింగిల్స్ ప్రవేశాన్ని రద్దు చేస్తూ పలు సూచనలు జారీ చేశారు పోలీసులు. మహిళలు ఖచ్చితంగా కపుల్స్‌తో కానీ, వారికి సంబంధించిన బంధువులతో కానీ రావాలని రాచకొండ పోలీసులు హెచ్చరించారు.
గత కొద్ది రోజులుగా మహిళలపై జరుగుతోన్న దాడుల దృష్ట్యా తాజాగా పోలీసులు ఈ నిబంధనలను ప్రవేశపెట్టారు. ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఈవెంట్ నిర్వాహకులందరికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరిగే అన్ని ప్రదేశాల వివరాలు తమకు ఇవ్వాలని, సరైన భద్రతా ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు.