iDreamPost
android-app
ios-app

ఏపీ లో భారీగా కొత్త కార్పొరేషన్లు

ఏపీ లో భారీగా కొత్త కార్పొరేషన్లు

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో ఆయా కులాల వారిగా కార్పొరేషన్లు ఏర్పాటుకు జగన్ సర్కార్ చర్యలు ప్రారంభించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 30 కార్పొరేషన్లు ఉండగా అదనంగా మరో 60 ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జగన్ సర్కార్ ఏర్పాటైన తరవాత ఎస్సి కార్పొషన్ ను మాల , మాదిగ, రెల్లి కులాల పేరుతొ 3  కార్పొరేషన్లు గా విభజించారు. 

కొద్దీ రోజుల్లో 60 నూతన కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో బీసీలకు 57, ఈబీసీలకు 3 కార్పొ రేషన్లు ఉన్నాయి. బీసీల్లో ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా ఆదుకోనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ప్లాన్‌ ‘ఏ’ కింద 16, ప్లాన్‌ ‘బీ’ కింద మరో 41 కార్పొరేషన్ల ఏర్పా టుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఇవికాకుండా కమ్మ, రెడ్డి, క్షత్రియులకు ప్రత్యేకంగా ఒక్కొక్క కార్పొరేషన్‌ ప్రతిపాదించారు.

ఈ నెల 1న ముఖ్యమంత్రితో బీసీ సంక్షేమ శాఖ సమీక్ష జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాల వాయిదా పడింది. త్వరలో జరగబోయే సమీక్షలో కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. బీసీ–ఏ గ్రూపులో ఆదిమ తెగలు, విముక్తి జాతులు, సంచార, సెమీ సంచార జాతుల వారు, బీసీ–బీ గ్రూపులో వృత్తిపరమైన పనులు చేసుకునే, బీసీ–సీ గ్రూపులో క్రైస్తవ మతంలోకి మారిన వారు, బీసీ–డీ గ్రూపులో ఇతర బీసీ కులాల వా1రు, బీసీ–ఈ గ్రూపులో ముస్లింలలో వెనుకబడిన కులాలున్నాయి.\

jojobetjojobet girişjojobetjojobet girişjojobetjojobet girişjojobet güncel giriş