iDreamPost
android-app
ios-app

సింప్లిసిటీకి మారు పేరు.. అతిధిగా వచ్చి జనాల మధ్యలో చివరి వరుసలో కూర్చున్న ద్రవిడ్..

  • Published May 17, 2022 | 6:44 PM Updated Updated May 17, 2022 | 6:46 PM
సింప్లిసిటీకి మారు పేరు.. అతిధిగా వచ్చి జనాల మధ్యలో చివరి వరుసలో కూర్చున్న ద్రవిడ్..

రాహుల్ ద్రవిడ్.. ది వాల్.. భారత క్రికెట్ లోని గొప్ప వ్యక్తుల్లో ఒకరు. తన ఆటతో దేశానికి ఎన్నో విజయాలు అందించడమే కాక ఒక మంచి వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్నారు. కెరీర్లో ఎలాంటి వివాదం లేకుండా అందరితో మంచిగా ఉంటూ దేశానికి, ఆటకి పేరు తెస్తూ ఆయన కూడా ఎంతో పేరు సంపాదించారు. రాహుల్ ద్రవిడ్ ని సింప్లిసిటీకి మారు పేరు అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఆయన అలాగే బతుకుతారు.

తాజాగా ఇది మరోసారి నిరూపించారు రాహుల్ ద్రవిడ్. ఇటీవల రాహుల్ ద్రవిడ్ మాజీ క్రికెటర్ G విశ్వనాధ్ ఆటోబయోగ్రఫీ Wrist Assured పుస్తక లాంచింగ్ కార్యక్రమానికి వచ్చాడు. బెంగుళూరులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ బయోగ్రఫీకి లాంచింగ్ కార్యక్రమానికి ద్రవిడ్ ని ఆహ్వానించగా ఓ హాల్ లో ఈ ప్రోగ్రాం జరుగుతున్న సమయంలో ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా వచ్చి అక్కడ ఉన్న జనాల మధ్య చివరి వరుసలో ఖాళీ ఉంటే కూర్చున్నాడు.

 

అక్కడ జనాలు ఇది చూసి రాహుల్ ద్రావిడ్ సింప్లిసిటీ అంటూ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత విశ్వనాధ్ ముందుకు వచ్చి కూర్చోమని అడగగా ద్రవిడ్ ముందుకి వెళ్ళాడు. ఇక ద్రవిడ్ ని మాట్లాడమని అడగగా ఇది విశ్వనాధ్ ఈవెంట్ అతనే ఇంపార్టెంట్. అతనే మాట్లాడాలి అంటూ విషెష్ చెప్పి మైక్ అతనికి ఇచ్చాడు. దీంతో ద్రవిడ్ మరోసారి అందరి మనసులని గెలుచుకున్నాడు. దీనిని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ద్రవిడ్ ని అభినందిస్తున్నారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş