iDreamPost
android-app
ios-app

దేశంలో 30 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో 30 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా  ఉధృతంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 29,435 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా 934 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 6869 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.  గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1543 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 62 మంది మరణించారు.

ముఖ్యంగా మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక మరణాలు, అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి.గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 522కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 8590 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 369మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

తెలుగురాష్ట్రాలలో కూడా కరోనా ఉధృతి కొనసాగుతుంది.

తెలంగాణలో 1004 పాజిటివ్ కేసులు నమోదవగా, 26 మంది మృతిచెందారు.వైరస్ బారినుండి తెలంగాణలో 321 మంది కొలుకున్నారు. తెలంగాణాలో గత రెండురోజులుగా మరణాల సంఖ్య నమోదు కాకపోవడంతో పాటు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం కాస్త ఊరటనిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో 1183 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా 31 మంది మృతిచెందారు.  235 మంది వైరస్ బారినుండి కోలుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 3,065,090 మందికి కోవిడ్ 19 సోకగా 2,11,620 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 922,844 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,010,507 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 56,803 మంది మరణించారు.