iDreamPost
android-app
ios-app

ప‌వ‌ర్ క‌పుల్ ఆస్తులెంత‌?

  • Published Jun 22, 2022 | 4:31 PM Updated Updated Jun 22, 2022 | 4:31 PM
ప‌వ‌ర్ క‌పుల్ ఆస్తులెంత‌?

న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివన్ మ్యారేజ్ అయిన త‌ర్వాత ఇద్ద‌రి ఆస్తుల‌ను క‌లిపితే విలువెంత‌? ఇదీ కోలీవుడ్ వేస్తున్న లెక్క‌లు. ఇద్ద‌రి ఆస్తుల విలువ మొత్తాన్ని చూస్తే, నోరెళ్ల‌బెట్టేంత రేంజ్ లో ఉంది. ప‌వ‌ర్ క‌పుల్ కు, ఓ పెద్ద బంగ్లా, 4 BHK flatలు, విలాసంవ‌త‌మైన ప్రొప‌ర్టీలు వీళ్ల సొంతం.

త‌మిళ‌నాడులోనే కాదు, సౌత్ ఇండియాలోనే లేడీ సూప‌ర్ స్టార్ గా న‌య‌న‌తార‌కు పేరుంది. ఆమె కోసం సూప‌ర్ స్టార్లు ఎదురుచూస్తుంటారు. ఆమె మాత్రం హీరోయిన్ ఓరియెంటెట్ మూవీస్ ను న‌మ్ముకుంది. ఆమె సినిమాకు ఆమే హీరో. ఒక్కోసినిమాకు ఆమె రెమ్యునిరేష‌న్ దాదాపు రూ.10కోట్లు. ఆరేళ్లుగా విఘ్నేష్ తో డేటింగ్ లో ఉన్న న‌య‌న్ తార‌, రెండేళ్లుగా స‌హ‌జీవ‌నంలో ఉన్నారు. ఇద్ద‌రూ ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు.

ప‌వ‌ర్ క‌పుల్ ఆస్తులెంత‌?
మ్యారేజ్ త‌ర్వాత, ఇద్ద‌రి ఆస్తుల విలువ రూ.215 కోట్లు. ఇందులో లేడీ సూప‌ర్ స్టార్ సొంత ప్రొప‌ర్టీలు రూ.165 కోట్లు. దాదాపు 20 ఏళ్ల‌ నుంచి ఇండ‌స్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ కు ఆమాత్రం ఆస్తులు ఉండ‌టం ఆశ్చ‌ర్య‌మేమీకాదు. ఆమె డైరెక్ట‌ర్ హ‌జ్బండ్ కు ఆస్తులు త‌క్కువేం కాదు. రూ.50కోట్ల మేర ఆస్తుల‌ను సంపాదించాడు. ఇప్పుడు ఇద్ద‌రూ క‌లిస్తే ప‌వ‌ర్ క‌పుల్ రేంజ్ కి ఎదిగిపోయారు. పోయ‌స్ గార్డెన్ లో రూ.20కోట్ల విలువ చేసే బిల్డింగ్ విఘ్నేష్ కు ఉంది. ఇక‌ న‌య‌న్ కు, హైద‌రాబాద్ లో రూ.15కోట్లు విలువ చేసే రెండు బిల్డింగ్ లు, చైన్నైలో రెండు 4 BHK ప్లాట్లున్నాయి. దేశ‌మంత‌టా ఆమెకు స్థ‌లాలు, ప్లాట్లు ఉన్నాయి. ఆమెకు కోట్ల‌లో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంద‌ని అంటారు.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş