iDreamPost
android-app
ios-app

75 రూపాయల టికెట్ – తేదీ మారింది

  • Published Sep 13, 2022 | 1:54 PM Updated Updated Dec 05, 2023 | 5:01 PM

దానికి తగ్గట్టే మూవీ లవర్స్ తక్కువ ధరలతో కొత్త చిత్రాలు చూసేందుకు రెడీ అయ్యారు.

దానికి తగ్గట్టే మూవీ లవర్స్ తక్కువ ధరలతో కొత్త చిత్రాలు చూసేందుకు రెడీ అయ్యారు.

75 రూపాయల టికెట్ – తేదీ మారింది

ఈ వారం 16న నేషనల్ సినిమా డే సందర్భంగా దాదాపు అన్ని మల్టీ ప్లెక్సులు, థియేటర్లలో 75 రూపాయలకే టికెట్లు అమ్మబోతున్నట్టు రెండు వారాల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే మూవీ లవర్స్ తక్కువ ధరలతో కొత్త చిత్రాలు చూసేందుకు రెడీ అయ్యారు. యుఎస్ లో ఈ కాన్సెప్ట్ అద్భుతమైన స్పందన దక్కించుకుని ఏకంగా లక్షకు పైగా ఫుట్ ఫాల్స్ ని ఒక్క రోజులోనే పెంచేసింది. దానికి పదింతలు ఎక్కువ స్థాయిలో ఇక్కడా రెస్పాన్స్ ఉంటుందనే అంచనాలు ఆల్రెడీ ఉన్నాయి. ఆ రోజు టాలీవుడ్ లో రిలీజ్ కాబోతున్న ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, శాకినీ డాకిని, నేను మీకు బాగా కావలసినవాడిని ఎంజాయ్ చేయొచ్చని అనుకున్నారు.

అనూహ్యంగా ఇప్పుడీ డేట్ మారింది. వచ్చే శుక్రవారం 23న ఈ స్పెషల్ రేట్ అందుబాటులో రానుందని సవరించిన ప్రకటన ఒకటి ఇందాక విడుదల చేశారు. 4000కి పైగా స్క్రీన్లలో ఈ వెసులుబాటు అందుబాటులోకి రానుందని, అధిక శాతం ప్రేక్షకులకు ఇందులో భాగం చేసే ఉద్దేశంతోనే ఇలా మార్చామని అందులో పేర్కొన్నారు. అయితే ఇన్ సైడ్ టాక్ మరోలా ఉంది. బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ వారం పూర్తి కాగానే సగానికి పైగా టికెట్ రేట్ తగ్గిస్తే వచ్చే జనం పెరుగుతారు కానీ ఆ మేరకు రెవిన్యూ రాదు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకునే తేదీని చేంజ్ చేశారనే టాక్ ఉంది. ఇది నిజం కాదని కొట్టిపారేయడానికి లేదు. అయితే పాత దానికే కట్టుబడి ఉంటే బ్రహ్మాస్త్రకు ఇంకా ప్లస్ అయ్యేది.

థాంక్ యు పేరిట తీసుకొస్తున్న ఈ స్కీం లో వచ్చే వారం రాబోతున్న శ్రీవిష్ణు అల్లూరి, నాగ శౌర్య కృష్ణ వృందా విహారి, శ్రీసింహ దొంగలున్నారు జాగ్రత్త, సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం ఆడియన్స్ కి లో ప్రైజ్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వబోతున్నాయి. ఒకవేళ రెండు వారాల దాకా బ్రహ్మాస్త్ర చూడని వాళ్లకు ఇది మంచి ఛాన్స్. తరగతితో తేడా లేకుండా గోల్డ్, ప్రీమియర్ అన్ని క్లాసులకు ఒకటే డెబ్భై అయిదు రూపాయల రేట్ ఉంటుంది. కాకపోతే దొరకడం అంత ఈజీగా కాకపోవచ్చు. ఆన్ లైన్ లో పెడతారు కాబట్టి బుకింగ్ చార్జీలను భరించి హ్యాపీగా మల్టీ ప్లెక్సుల్లో కోరుకున్న సినిమా చూసేయొచ్చు. అయినా కూడా వంద లోపే అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet