iDreamPost
android-app
ios-app

నాగ్ రీ ఎంట్రీ – ఆ ఇద్దరిపై నోయెల్ ఫైర్

  • Published Nov 01, 2020 | 7:43 AM Updated Updated Nov 01, 2020 | 7:43 AM
నాగ్ రీ ఎంట్రీ – ఆ ఇద్దరిపై నోయెల్ ఫైర్

కొత్త వీకెండ్ కోసం నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ నుంచి నేరుగా బిగ్ బాస్ 4 హౌస్ కు వచ్చేశారు. మొన్న దసరా పండగ స్పెషల్ ఎపిసోడ్ ని కోడలు పిల్ల సమంతా మేనేజ్ చేసింది కానీ ప్రతిసారి అలా సాధ్యపడదు కాబట్టి తనే రంగంలోకి దిగాడు. రంగస్థలం పాటతో హుషారుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక టాస్కుల విషయానికి వస్తే వంటల పోటీ పెట్టి సభ్యులను ఆడ మగగా విభజించి జెంట్స్ కు రొయ్యల కర్రీ, లేడీస్ కు పాలక్ పన్నీర్ కర్రీ చేయాలని ఎవరు బాగా రుచిగా చేస్తారో మెహబూబ్, అభిజిత్ లు డిసైడ్ చేస్తారని చెప్పాడు బిగ్ బాస్. వాళ్లకు మాస్టర్ వండి పెట్టిన నాన్ వెజ్ ఐటెమే బాగా నచ్చడంతో బాయ్స్ బృందం విజేతలుగా నిలిచింది. ఎప్పటిలాగే ఎలిమినేషన్ గురించి నాగ్ మళ్ళీ మాట్లాడారు. అమ్మ రాజశేఖర్, మెహబూబ్, అఖిల్, లాస్య, అరియనాలలో ఒకరు వెళ్తారని క్లారిటీ ఇచ్చాడు.

కులుమనాలి నుంచి తెచ్చిన స్వెట్టర్లను పార్టిసిపెంట్స్ కానుకగా ఇచ్చారు నాగ్. అఖిల్ సోహైల్ మధ్య ఉన్న అపార్థాలను వీడియో ద్వారా క్లియర్ చేశారు. మోనాల్ కు తెలిసివచ్చేలా తనను టార్గెట్ చేసిన లాస్య, అభిజిత్ ల వీడియోలు ప్లే చేసి తనను షాక్ కి గురి చేశారు. కన్ఫెషన్ రూమ్ లో అరియనా, రేషన్ మేనేజర్ కాలేదన్న కోపంలో అమ్మ రాజశేఖర్, అవినాష్ ఏం చేశాడు తదితర వీడియోలు చూపించడం వాళ్ళు ఊహించనిది. ఈ సందర్భంగానే అరియనా బాధను వెళ్లగక్కింది. ఈ రహస్య వీడియోలను బట్టబయలు చేయడం ద్వారా సభ్యుల మధ్య కొత్త వివాదాలు వచ్చేందుకు బిగ్ బాస్ వేసిన ప్లాన్ ముందు ముందు వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇక ఒక్కొక్కరు హౌస్ తమకు ఎవరెవరు ఎందుకు విలన్లో చెప్పుకుంటూ పోవడం కాసేపు సాగతీత దిశగా వెళ్ళింది. ఎవరి కారణాలు వాళ్ళు వివరించుకున్నారు.

ఇక ఓ ఏడుస్తున్న బొమ్మను వాళ్ళ చేతికి ఇచ్చి ఎవరి దగ్గరైతే అది నవ్వుతుందో వాళ్ళు నెక్స్ట్ ఎలిమినేషన్ కు సేఫ్ అని చెప్పే వెరైటీ ఆట ఒకటి పెట్టారు. అందులో అఖిల్ సేవ్ అయ్యాడు. ఇక నోయెల్ ఎపిసోడ్ మొత్తానికి హై లైట్ గా నిలిచింది. అనారోగ్యం వల్ల తను రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదనే క్లారిటీ ఇస్తూ దొరికిన అవకాశాన్ని వాడుకుని అమ్మ రాజశేఖర్, అవినాష్ లకు ఓ రేంజ్ లో క్లాస్ పీకాడు. దెబ్బకు జడుసుకున్న ఆ ఇద్దరు రివర్స్ అటాక్ చేశారు కానీ ఆలోగానే జరగాల్సిన డ్యామేజ్ అయిపోయింది. అవినాష్ చాలా సీరియస్ అయినప్పటికీ నాగార్జున అంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి సారీ చెప్పించాడు. ఇలా సేవ్ చేసే పనిలో భాగంగా నోయెల్ తన తరఫున లాస్యను కాపాడి అక్కడి ఓ మంచి ర్యాంప్ సాంగ్ తో హుషారు నింపి సెలవు తీసుకున్నారు. మొత్తానికి సరదాగా గరంగరంగా గడిచిపోయింది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş