iDreamPost
android-app
ios-app

సినిమాకి చాలా టైం ఉంది.. ‘ప్రాజెక్ట్ K’ పై నాగ్ అశ్విన్ ట్వీట్..

  • Published May 18, 2022 | 9:00 PM Updated Updated May 19, 2022 | 6:40 PM
సినిమాకి చాలా టైం ఉంది.. ‘ప్రాజెక్ట్ K’ పై నాగ్ అశ్విన్ ట్వీట్..

వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రభాస్ చేతిలో ఉన్న భారీ సినిమాల్లో ‘ప్రాజెక్ట్ K’ ఒకటి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్విని దత్ ఈ సినిమాని నిర్మిస్తుండగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, దిశా పటాని ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా తాజాగా ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు.

ప్రభాస్ అభిమానులంతా ఇటీవల వచ్చిన రాధేశ్యామ్ సినిమా పరాజయం అవ్వడంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ ప్రభాస్ అభిమాని గతంలో నాగ్ అశ్విన్ చేసిన ఓ ట్వీట్ ని షేర్ చేసి.. ‘హాయ్ నాగ్ అశ్విన్ అన్నా గుర్తున్నామా’ అంటూ ‘ప్రాజెక్ట్ K’ అప్డేట్ గురించి అడిగాడు. ఈ ట్వీట్ కి నాగ్ అశ్విన్ ని ట్యాగ్ చేశాడు.

ప్రభాస్ అభిమాని చేసిన ఈ ట్వీట్ చూసిన నాగ్ అశ్విన్ దానికి రిప్లై ఇచ్చాడు. నాగ్ అశ్విన్ ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. ”గుర్తున్నారు.. ఇప్పుడే సినిమా ఒక షెడ్యూల్ అయిపోయింది. ప్రభాస్ గారి ఇంట్రో సీన్ కూడా పూర్తి అయింది. అది చాలా బాగా వచ్చింది. హీరో చాలా కూల్ గా ఉన్నారు. జూన్ చివరి నుంచి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. రిలీజ్ ఆర్డర్ లో మనం లాస్ట్ కదా, రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ ప్రాజెక్ట్‌- K సినిమా కోసం అందరం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం” అని ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ ట్వీట్ ని షేర్ చేస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ చెప్పిన దాని ప్రకారం సలార్, ఆది పురుష్ సినిమాలు రిలీజ్ అయినా తర్వాతే ‘ప్రాజెక్ట్ K’ రిలీజ్ అయ్యేలా ఉన్నట్టు తెలుస్తుంది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş