iDreamPost
android-app
ios-app

ముదిరిన హీరో డైరెక్టర్ వార్

  • Published Mar 14, 2020 | 11:28 AM Updated Updated Mar 14, 2020 | 11:28 AM
  • Published Mar 14, 2020 | 11:28 AMUpdated Mar 14, 2020 | 11:28 AM
ముదిరిన హీరో డైరెక్టర్ వార్

 డిటెక్టివ్ సీక్వెల్ షూటింగ్ విషయంలో దర్శకుడు మిస్కిన్ కు, హీరో విశాల్ కు మధ్య తలెత్తిన వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది. మొన్న మిస్కిన్ చేసిన విపరీతమైన డిమాండ్ల గురించి లేఖలు విడుదల చేసిన విశాల్ వాటితో కోలీవుడ్ లో పెద్ద దుమారమే రేపాడు. గొంతెమ్మ కోరికలు చెప్పినందుకే మిస్కిన్ ని తప్పించి తాను దర్శకుడిగా మారాల్సి వచ్చిందని సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. ఇదంతా నమ్మశక్యంగానే ఉండటంతో మీడియా సైతం దీనికి ప్రాచుర్యం కలిగించింది. తాజాగా మిస్కిన్ దీని గురించి స్పందించాడు. ఆయన వివరణ ఇలా ఉంది

” నేను విశాల్ ని తమ్ముడి కంటే ఎక్కువగా భావించాను. అతని కెరీర్ ఫెయిల్యూర్స్ తో బ్యాడ్ గా ఉన్నప్పుడు డిటెక్టివ్ హిట్ ఇచ్చాకే కుదురుకున్నాడు. దీనికి సీక్వెల్ గా కోహినూర్ డైమండ్ దొంగతనాన్ని బ్యాక్ డ్రాప్ గా తీద్దామని చెప్తే తనే నిర్మాతగా మారేందుకు ముందుకు వచ్చాడు. ప్రాథమిక దశలోనే 20 కోట్ల దాకా బడ్జెట్ అవుతుందని చెప్పాను. ఒకవేళ యాక్షన్ సినిమా ఫ్లాప్ అయితే ఇంత బడ్జెట్ భరించడం కష్టమవుతుందని విశాల్ కు అన్నాను. అందుకే దీన్ని వాయిదా వేసి చెన్నై నేపధ్యంలో వేరే కథతో డిటెక్టివ్ 2 నచ్చజేప్పాను. విశాల్ వినలేదు. న్యూ యార్క్ కు లొకేషన్ హంట్ కి వెళ్ళినప్పుడు అతన్ని 7.5 లక్షలు అడిగాను. కాని నేను ఖర్చు పెట్టింది 7 లక్షలే. లెక్కలు చూసుకోవచ్చు

నేను 35 లక్షలు ఖర్చు పెట్టానని విశాల్ అంటున్నాడు. నాకు యుకే వెళ్ళినప్పుడు ఇచ్చిన ఫోరెక్స్ కార్డ్ స్టేట్మెంట్ చూపించి ప్రూవ్ చేయాల్సిందిగా సవాల్ చేస్తున్నాను. 30 రోజుల షూటింగ్ కు 13 కోట్లు పెట్టించానని అంటున్నారు. అది కూడా రుజువు చేయాలి. నన్ను నా సోదరుడిని వాళ్ళ ఆఫీస్ లో తీవ్రంగా అవమానించారు. నా తల్లిని ప్రస్తావనకు తెచ్చి దూషించడం ఏం సంస్కారం. తమ్ముడిలా భావించడం వల్లే ఇప్పటిదాకా విశాల్ మీద ఎలాంటి లీగల్ చర్యలకు నేను పోలేదు. కాని అతనికి ఆ విశ్వాసం లేదు. ఇప్పుడు నా సహనం కోల్పోయాను. విశాల్ కు అసలైన ట్రబుల్ ఇప్పటినుంచి మొదలవుతుంది. సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తున్నా”

ఇదీ మిస్కిన్ సుదీర్ఘంగా ఇచ్చిన వివరణ తాలుకు సారాంశం. ఇప్పటికే ఈ గొడవ అక్కడి ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో నలుగుతోంది. ఇందులో తప్పెవరిది ఉందో అర్థం కాక చెన్నై మీడియా సైతం కన్ఫ్యూజన్ లో ఉంది. మిస్కిన్ ఇప్పుడు తన మీద ఆరోపణలు ప్రూవ్ చేయమని సవాల్ విసిరాడు కాబట్టి విశాల్ దీనికి ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరిలో తప్పెవరిది ఉందో కూడా అంత ఈజీగా అంతు చిక్కడం లేదు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet giriş