iDreamPost
android-app
ios-app

హిట్టు కోసం శర్వానంద్ కొత్త కాంబో

  • Published Jun 06, 2022 | 4:08 PM Updated Updated Jun 06, 2022 | 4:08 PM
హిట్టు కోసం శర్వానంద్ కొత్త కాంబో

గత మూడేళ్లుగా హిట్ లేక సతమతమవుతున్న శర్వానంద్ కొత్త సినిమా ఒకే ఒక జీవితం ఎప్పుడో పూర్తయినా విడుదల మాత్రం అదిగో ఇదిగో అంటూ వాయిదా వేసుకుంటూ ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. థియేటర్లలోనే వదులుతారా లేక ఓటిటికి ఇచ్చే ఆలోచన ఏదైనా ఉందా లాంటి కనీస సమాచారం యూనిట్ నుంచి లేదు. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అమల అక్కినేని ఓ కీలక పాత్ర పోషించారు. దీని సంగతలా ఉంచితే శర్వా ప్రస్తుతం ఒక కొత్త కాంబినేషన్ ని సెట్ చేసుకున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్న యాక్షన్ ఎంటర్ టైనర్ తో మళ్ళీ కం బ్యాక్ అవుతాననే నమ్మకంతో ఉన్నాడు.

ఇందులో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించబోతున్నట్టు టాక్. ఈ ఇద్దరు కలిసి ఇప్పటిదాకా నటించలేదు. ఇది ఫస్ట్ టైం. అఫీషియల్ గా చెప్పలేదు కానీ కాంబోని లాక్ చేశారని వినికిడి. కృష్ణ చైతన్య ఆ మధ్య నితిన్ తో పవర్ పేట అనే భారీ ప్రాజెక్టు ఒకటి ప్లాన్ చేసుకున్నాడు. గుంటూరు ప్రాంతానికి చెందిన ఒక రౌడీ షీటర్ కథని చెప్పే క్రమంలో రెండు భాగాలుగా సిద్ధం చేసుకున్నాడు. ఆల్మోస్ట్ అంతా ఓకే అయ్యిందనుకుంటున్న టైంలో అది ఆగిపోయింది. దానికి కారణాలు బయటికి చెప్పలేదు కానీ ఇప్పుడు శర్వాతో చేస్తోంది అదే ప్రాజెక్టా లేక ఏదైనా ఫ్రెష్ సబ్జెక్టు ఎంచుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. టైటిల్ అనౌన్స్ చేశాక క్లారిటీ రావొచ్చు.

హీరో దర్శకుడు ఇద్దరికీ ఇది సక్సెస్ ఇవ్వాల్సిన సినిమా. కృష్ణచైతన్య లాస్ట్ మూవీ నితిన్ చల్ మోహనరంగా. పవన్ కళ్యాణ్ నిర్మాతగా త్రివిక్రమ్ అండదండలతో నిర్మించిన ఆ మూవీ ఆశించిన విజయాన్ని సాదించలేదు. కేవలం డెబ్యూ మూవీ రౌడీ ఫెలో మాత్రమే అతనికి పేరు తెచ్చింది. ఇక శర్వా సంగతి చూస్తే మహా సముద్రం, శ్రీకారం, జాను, రణరంగం, పడి పడి లేచే మనసు ఇలా ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లు అందుకున్న ట్రాక్ రికార్డు మార్కెట్ ని బాగా ఎఫెక్ట్ చేసింది. ప్రస్తుతం కాస్త బరువు తగ్గే పనిలో ఉన్న శర్వానంద్ కు మరి కృష్ణచైతన్య ఎలాంటి జానర్ తీసుకుంటాడో చూడాలి. త్వరలోనే అన్ని వివరాలు ప్రకటించబోతున్నారు.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet