iDreamPost
android-app
ios-app

NTR 31 FIRST LOOK ఎన్టీయార్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది

  • Published May 20, 2022 | 1:08 PM Updated Updated May 20, 2022 | 1:14 PM
NTR 31 FIRST LOOK ఎన్టీయార్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది

స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్, అనుకున్న‌ట్లుగానే జూ ఎన్టీయార్ ఫాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ నిచ్చాడు. జూ.ఎన్టీయార్ 31వ సినిమాకు ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. ఇదికూడా కేజీఎఫ్, స‌లార్ స్టైల్ లోనే క‌నిపిస్తోంది. ర‌క్తంతో త‌డిచిన నేల మాత్ర‌మే ఎప్పుడూ గుర్తిండిపోతుంది. కాని ఈ నేలే ఆయ‌న వార‌స‌త్వం, ర‌క్తం కాదు అంటూ సూప‌ర్ కొటేష‌న్ తో రిలీజ్ చేశారు. ఈ లుక్ లో ఎన్టీయార్ చాలా ఇంటెన్సీవ్ గా క‌నిపిస్తున్నారు. ఈసినిమాను మైత్రీ మూవీమేక‌ర్స్, ఎన్టీయార్ ఆర్ట్స్ క‌ల‌సి నిర్మిస్తున్నాయి.

ఇది పాన్ ఇండియ‌న్ సినిమా. ఆర్ఆర్ఆర్ ని మించిపోయే రేంజ్ లో రాబోతోంద‌ని టాక్. వ‌చ్చే ఎప్రిల్ నుంచి సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇది 20 ఏళ్ల క్రితం అనుకున్న క‌థ‌. స‌రైన హీరో దొర‌క‌డంతో ఇప్ప‌టికి వాస్త‌వ‌మైంద‌న్న ప్ర‌శాంత్ నీల్ కామెంట్స్ తో అప్పుడే సినిమాకు రేంజ్ పెరిగిపోయింది. నీల్ లాంటి డైరెక్ట‌ర్ దొరికితే జూ.ఎన్టీయార్ విశ్వ‌రూపాన్ని వెండితెర‌మీదే చూడొచ్చు.

స‌లార్ త‌ర్వాత వ‌చ్చే ఈ సినిమా high voltage action entertainer కానుంది. నీల్ టేకింగ్ కు, ఎన్టీయార్ యాక్టింగ్ తోడైతే, హాలీవుడ్ రేంజ్ మూవీనే ఆశించొచ్చ‌న్న‌ది ఫ్యాన్స్ మాట‌.