iDreamPost
android-app
ios-app

Sarkaru Vaari Paata సర్కారు వారి పాట కీలకమైన అప్డేట్స్

  • Published Apr 18, 2022 | 4:58 PM Updated Updated Apr 18, 2022 | 4:58 PM
  • Published Apr 18, 2022 | 4:58 PMUpdated Apr 18, 2022 | 4:58 PM
Sarkaru Vaari Paata సర్కారు వారి పాట కీలకమైన అప్డేట్స్

మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట విడుదలకు ఇంకో 24 రోజులు మాత్రమే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చివరి పాట చిత్రీకరణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇవాళ రిలీజ్ చేయబోతున్నారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండున్నరేళ్ల గ్యాప్ తో వస్తున్న ప్రిన్స్ మూవీ కావడంతో అభిమానుల ఎగ్జైట్మెంట్ మాములుగా లేదు. ఇప్పటిదాకా వచ్చిన రెండు సాంగ్స్ ఆల్రెడీ చార్ట్ బస్టర్ అయ్యాయి. మూడో దాని తాలూకు అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నారు. టైం తక్కువగా ఉంది కాబట్టి ప్రమోషన్ వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ప్యాన్ ఇండియా రిలీజ్ ఉండకపోవచ్చని ఇన్ సైడ్ టాక్. కేవలం తెలుగు తమిళ వెర్షన్ కు పరిమితం కావొచ్చు.

దీని తాలూకు కొన్ని కీలకమైన అప్ డేట్స్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. అందులో మొదటిది ఫస్ట్ హాఫ్ లో సాగే 40 నిమిషాల లవ్ ట్రాక్. కీర్తి సురేష్ తో మహేష్ బాబు ప్రేమకథ చాలా సరదాగా నవ్వుకునేలా వచ్చిందట. గీత గోవిందం స్టైల్ లో దూకుడు ఫ్లేవర్ ని మిక్స్ చేసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తారట. దర్శకుడు పరశురామ్ తన బలమైన కామెడీని బాగా తెరకెక్కించినట్టు చెబుతున్నారు. అలా అని మాస్ ని మిస్ చేయడం కాదు. ప్రీ ఇంటర్వెల్ లో నరసింహస్వామి గుడి దగ్గర ఫైట్ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుందని లీకవుతున్న న్యూస్ ని బట్టి తెలుస్తోంది. సో అల్ ఇన్ వన్ ప్యాకేజీ అన్నమాట.

శ్రీమంతుడు నుంచి ఎక్కవగా సాఫ్ట్ కార్నర్ పాత్రలు చేస్తున్న మహేష్ నుంచి ఒక్కడు పోకిరి టైపు హీరోయిజంని అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే సర్కారు వారి పాట ఉండొచ్చు. విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. మే 12 కోసం డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాలు, థియేటర్లు లాక్ చేసుకోవడం లాంటివి జరిగిపోతున్నాయి. ఆర్ఆర్ఆర్-కెజిఎఫ్ 2 అప్పటికి కొనసాగుతూ ఉంటాయి. ఆచార్య మూడో వారంలో ఉంటుంది. సో స్క్రీన్ల పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లానింగ్ చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం మెయిన్ అట్రాక్షన్. సముతిరఖని మెయిన్ విలన్ గా నటిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet