iDreamPost
android-app
ios-app

Adipurush :10 నెలల ముందే ప్రభాస్ టీమ్ జాగ్రత్త

  • Published Mar 01, 2022 | 1:42 PM Updated Updated Mar 01, 2022 | 1:42 PM
  • Published Mar 01, 2022 | 1:42 PMUpdated Mar 01, 2022 | 1:42 PM
Adipurush :10 నెలల ముందే ప్రభాస్ టీమ్ జాగ్రత్త

బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఆది పురుష్ రిలీజ్ డేట్ అఫీషియల్ గా లాక్ చేశారు. 2023 జనవరి 12 సంక్రాంతి కానుకగా థియేటర్లలో తీసుకురాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ముందు ఈ ఏడాది ఆగస్ట్ లో అనుకున్న తేదీకి ఏ మాత్రం సాధ్యాసాధ్యాలు లేకపోవడంతో ఫైనల్ గా నిర్ణయం మార్చుకున్నారు. ఇంకా పది నెలల సమయం ఉండగానే ఇలా చెప్పేయడం ఒక రకంగా మంచిదే. ఒకవేళ ఎవరైనా పోటీ రావాలనుకున్నా ప్రాక్టికల్ గా అన్నీ ఆలోచించే అవకాశం దీని ద్వారా కల్పించారు. ప్రభాస్ రాధే శ్యామ్ మార్చి 11న వస్తున్న నేపథ్యంలో కేవలం ఏడాది లోపే రెండు డార్లింగ్ సినిమాలు రావడం బాహుబలి తర్వాత ఇదే ఫస్ట్.

అంతా బాగానే ఉంది కానీ ఆది పురుష్ వస్తున్నంత మాత్రాన మిగిలినవాళ్లు తప్పుకుంటారన్న గ్యారెంటీ లేదు. ఆల్రెడీ దిల్ రాజు తమ బ్యానర్ 50వ సినిమా అదే సీజన్ కి వదులుతామని చెప్పేశారు. రామ్ చరణ్ శంకర్ ల కాంబో కావడంతో షూటింగ్ స్టేజి నుంచే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ఎంటర్ టైనర్ కూడా ఫెస్టివల్ ని టార్గెట్ చేసుకుని చిత్రీకరణ ప్లాన్ చేసుకుంది.  బాలకృష్ణ గోపిచంద్ మలినేని కలయికలో వస్తున్న సినిమా ఈ ఏడాది మిస్ చేసుకుంటే అదీ ఆ టైంలోనే రావాలి. మొత్తానికి ఇంత ముందుగా రాబోయే సంక్రాంతి గురించి చర్చలు మొదలుకావడం అనూహ్యం.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆది పురుష్ టాకీ పార్ట్ ఎప్పుడో పూర్తయ్యింది. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కృతి సనన్ సీతగా సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాలో ఊహించని అంశాలు చాలానే ఉంటాయట. ప్రస్తుతానికి ఫస్ట్ లుక్ లాంటివేవీ రాలేదు కానీ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మెల్లగా ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడని గ్రాఫిక్స్ ఇందులో చూపించబోతున్నారని ఇప్పటికే టాక్ ఉంది. మరి ఆది పురుష్ ఎలాంటి మేజిక్ చేయబోతోందో తెలియాలంటే ఇంకో పది నెలలు వేచి చూడక తప్పదు మరి. రామాయణ గాథ ఆధారంగా ఇది రూపొందింది

Also Read : Bholaa Shankar : మెగా మూవీ భారమంతా మెహర్ మీదే

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet