iDreamPost
android-app
ios-app

మోకా భాస్కర్ హత్య కేసు – పోలీసుల అదుపులో మరో తెలుగుదేశం నేత

  • Published Jul 10, 2020 | 11:11 AM Updated Updated Jul 10, 2020 | 11:11 AM
మోకా భాస్కర్ హత్య కేసు – పోలీసుల అదుపులో మరో తెలుగుదేశం నేత

సంచలనం రేపిన మచిలీపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్, వై.యస్.ఆర్ కాంగ్రెస్ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మొకా భాస్కరరావు హత్యకేసులో ఇప్పటికే తెలుగుదేశం నేత మాజీ మంత్రి కోల్లు రవింద్రతో పాటు  ప్రధాన నిందితుడు చింతా చిన్ని, చింతా నాంచారయ్య (పులి), చింతా కిషోర్‌, చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీకృష్ణను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగ ఈ హత్యకు సంబంధించి మరో తెలుగుదేశం నేత వ్యవహార శైలిపై అనుమానాలు బలపడటంతో అతనిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తునట్టు తెలుస్తుంది.

వై.యస్.ఆర్ కాంగ్రెస్ నేత మోకా భాస్కరరావు హత్య జరగడానికి సరిగ్గా వారం ముందు మచిలీపట్నం తెలుగుదేశం కార్యాలయంలో మాజీ కౌన్సిలర్ ఖాజా ప్రెస్ మీట్ పెట్టి భాస్కరరావుకు వార్నింగ్ ఇవ్వడం జరిగించని, ఖాజా ప్రెస్ మీట్ లో మాట్లాడుతు మోకా భాస్కరరావు వొళ్ళు దగ్గర పెట్టుకోవాలని , పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని, నువ్వు ఏమైనా పోటుగాడివా 5ఏళ్ళు కొల్లు రవీంద్ర మంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నావు, బయటికి రావడానికి కూడా భయపడ్డావు, మా చిన్నీనే నీకు కరెక్ట్ మొగుడు అని మాట్లాడారని.. హత్యకేసులో ప్రధాన నిందితుడైన చింతా చిన్ని పేరు ప్రస్థావించిన రెండు రోజుల నుండే చింతా చిన్ని భాస్కరరావు హత్యకు రెక్కీ నిర్వహించడం ప్రారంభించాడని ఈ ప్రెస్ మీట్ అయిన వారం రోజులకే చిన్నీ మొకా భాస్కరరావుని హత్యచేశారని చెప్పుకొచ్చారు.

ప్రెస్ మీట్ లో ఖాజా ప్రస్తావించిన అదే చింతా చిన్నీ భాస్కరరావు హత్యలో  ప్రధాన పాత్ర పోషించడంతో హత్యలో మాజీ కౌన్సిలర్ ఖాజా ప్రమేయంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యకు సంబంధించి వివరాలు ముందుగా తెలియబట్టే అయన ప్రస్ మీట్ లో బహిరంగ బెదిరింపులకు దిగారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఖాజా ని అదుపులోకి తీసుకుని విచారిసున్నట్టు సమాచారం.