iDreamPost
android-app
ios-app

ఇద్దరి చేతుల్లో మోసపోయిన మైనర్.. అక్కకు పెళ్లి కుదరడంతో ఇంట్లో చెప్పలేక..

  • Published Jun 08, 2022 | 5:44 PM Updated Updated Jun 08, 2022 | 5:44 PM
ఇద్దరి చేతుల్లో మోసపోయిన మైనర్.. అక్కకు పెళ్లి కుదరడంతో ఇంట్లో చెప్పలేక..

ఒక మైనర్ బాలిక ఇద్దరు వ్యక్తుల చేతుల్లో మోసపోయింది. వారి కామానికి బలిపశువైంది. తనకు జరిగిన దారుణాలను ఇంట్లో చెబుదామంటే.. అక్కకు పెళ్లికుదరడంతో మిన్నకుండిపోయింది. ఆఖరికి ఆ కామాంధుల వేధింపులు భరించలేక విషయం తల్లిదండ్రులకు చెప్పింది. సాక్ష్యాలు పక్కాగా ఉండటంతో.. పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన నిజామాబాద్ లో జరిగింది.

పదవ తరగతి చదువుతున్న బాధిత బాలిక నిజామాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్లో తల్లిదండ్రులు, అక్కతో కలిసి ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న రోహిత్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్యా చనువు కూడా పెరిగింది. రోజూ దాగుడుమూతలు ఆడుతూ.. రోహిత్ బాలికకు దగ్గరయ్యాడు. ఓ రోజు అపార్టెంట్ పైకి తీసుకెళ్లి నగ్నంగా ఫొటోలు తీశాడు. ఆ తర్వాతి నుంచి ఆ ఫొటోలను చూపించి బాలికను బెదిరించి, పలుమార్లు అత్యాచారం చేశాడు. ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక ఆ బాలిక నరకయాతన అనుభవించింది.

అదే సమయంలో ఓ రోజు బాలికకు ఇన్ స్టా గ్రామ్ లో భానుప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను మంచివాడని భావించిన బాలిక జరిగిన విషయాన్ని అతనికి చెప్పడంతో.. నేనున్నానంటూ ఓదార్చాడు. ప్రేమించానన్నాడు. కలవాలన్నాడు. అతని మాటలను గుడ్డిగా నమ్మి.. అతను పిలవగానే కలవడానికి వెళ్లింది. కల్యాణమండపానికి సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, న్యూడ్ గా ఫొటోలు తీశాడు.

అప్పట్నుంచి ఓ వైపు రోహిత్, మరోవైపు భానుప్రసాద్ బాలికకు న్యూడ్ ఫొటోలు చూపించి వేధించసాగారు. బాలిక అక్కకు పెళ్లి సంబంధం ఖాయమవ్వడంతో.. విషయం తెలిస్తే పరువు పోతుందని భావించి.. కొండంత బాధను గుండెల్లోనే దాచుకుంది. రోజురోజుకూ వేధింపులు పెరిగిపోతుండటంతో విషయం తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని.. వెంటనే రోహిత్, భానుప్రసాద్ లను అరెస్ట్ చేశారు. వారిద్దరి నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

 

 

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş