iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కొద్దిసేపటి కిందట మరణించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం వారం రోజులపాటు దుబాయ్‌లో పర్యటించి మొన్న సాయంత్రం హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు హుటాహుటిన గౌతమ్ రెడ్డిని ఆపోలో ఆస్పత్రికి తరలించే సమయానికే పరిస్థితి విషమించింది.
ఈ ఉదయం జిమ్ కు వెళ్ళటానికి సిద్దమవుతున్న సమయంలో హార్ట్ అటాక్ వచ్చింది. రెండుసార్లు కోవిడ్ బారిన పడిన గౌతమ్ రెడ్డికి గుండెపోటు రావటం పోస్ట్ కోవిడ్ కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.
Also Read : మాజీ ఎమ్మెల్యే ముంగమూరు ఇకలేరు
ఉదయం 7:45 గంటలకు అపస్మాకస్థితిలో ఉన్న గౌతమ్‌ను ఆస్పత్రికి చేర్చారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో గంటన్నరపాటు డాక్టర్లు సీపీఆర్ నిర్వహించారు. ఎంతప్రయత్నం చేసినా గౌతమ్ రెడ్డి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఉదయం 9:16 గంటలకు గౌతమ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మంచి ఆరోగ్యవంతుడు, రోజూ వ్యాయామం చేసే గౌతమ్ రెడ్డికి గుండెపోటు రావడం, గంటల వ్యవధిలోనే మరణించడం అందరినీ నిశ్చేష్టులను చేసింది.
గౌతమ్ రెడ్డి (49) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1971 నవంబర్ 2వ తేదీన జన్మించారు. బ్రిటన్‌లో ఎమ్మెస్సీ చదివారు. తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయ వారసుడిగా 2014లో వైసీపీ తరపున రాజకీయ ఆరంగేట్రం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం సాధించి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read : రాపూరు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులరెడ్డి మృతి