తెలంగాణ బంద్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లను ప్రతి 3నిమిషాలకు ఒకటి చొప్పున నడపనున్నారు. నాగోల్–అమీర్‌పేట్–హైటెక్‌సిటీ, ఎల్‌బీనగర్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గాల్లో సుమారు 4లక్షల మంది మెట్రో సేవలు వినియోగించుకునే అవకాశముంది. అలాగే ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి మార్గాల్లో 121ఎంఎటీఎస్ సర్వీసులు యథావిధిగానడుస్తాయి. 1.5 లక్షల మంది ఈ సేవలను వినియోగించుకోనున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్–బొల్లారం మధ్య నడిచే డెమూ రైలునుశనివారం మేడ్చల్ వరకు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ ఓప్రకటనలో పేర్కొన్నారు. అలాగే కాచిగూడ–నిజామాబాద్, కాచిగూడ–కర్నూల్ సిటీ మధ్య మరో రెండు జన సాధారణ రైళ్లు అదనంగా నడవనున్నాయి.