iDreamPost
android-app
ios-app

గాడ్ ఫాదర్ మీద అభిమానుల బాధ్యత

  • Published Jul 06, 2022 | 12:17 PM Updated Updated Jul 06, 2022 | 12:17 PM
  • Published Jul 06, 2022 | 12:17 PMUpdated Jul 06, 2022 | 12:17 PM
గాడ్ ఫాదర్ మీద అభిమానుల బాధ్యత

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్ ఫాదర్ విజయదశమి విడుదలకు రెడీ అవుతోంది. మొన్న వచ్చిన టీజర్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా రూపొందిన ఈ పొలిటికల్ డ్రామాలో సత్యదేవ్, నయనతార భార్యభర్తలుగా నటిస్తుండగా సునీల్, పూరి జగన్నాధ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆచార్య దారుణంగా డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ బాగా నిరాశలో ఉన్నారు.ఆ గాయాన్ని మాన్పాల్సింది గాడ్ ఫాదరే. కాకపోతే ఇది స్ట్రెయిట్ కథ కావడం అభిమానులను టెన్షన్ పెడుతోంది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లు తొలుత ఎంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఫైనల్ గా వంద కోట్ల మార్కు చేరుకోలేక జస్ట్ హిట్ దగ్గర ఆగిపోయాయి. గాడ్ ఫాదర్ కు అలా అవ్వకూడదనే వాళ్ళ కోరిక.

మెగా మార్కెట్ ఇంకా తగ్గలేదని నిరూపించుకునే బాధ్యత కూడా ఈ సినిమా మీదే ఉంది. తమన్ సంగీతం, భారీ బడ్జెట్ లాంటి ఆకర్షణలు ఎన్ని ఉన్నా ఫైనల్ గా మాస్ ఆడియన్స్ ని మెప్పించడం చాలా కీలకం. చిరు ఇమేజ్ కొచ్చిన డ్యామేజ్ ఏమీ లేదని రుజువు చేయాలంటే గాడ్ ఫాదర్ యావరేజ్ ఉంటే సరిపోదు. చిన్న టీజర్ ఓకే అనిపించింది కానీ మరీ గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్ లో పండలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు సందర్భంగా వదలబోయే ట్రైలర్ చూశాక ఒక అంచనాకు రావొచ్చు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio