iDreamPost
android-app
ios-app

తారక్ ముందున్న భారీ లక్ష్యం

  • Published Aug 02, 2021 | 4:52 AM Updated Updated Aug 02, 2021 | 4:52 AM
  • Published Aug 02, 2021 | 4:52 AMUpdated Aug 02, 2021 | 4:52 AM
తారక్ ముందున్న భారీ లక్ష్యం

ఇంకో రెండు వారాల్లో జెమిని ఛానల్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు క్విజ్ షో ప్రారంభం కాబోతోంది. ఆగస్ట్ 15 లేదా 16 ఈ రెండు తేదీల్లో ఒకదాన్ని లాక్ చేశారని సమాచారం. జాతరత్నాలు వరల్డ్ ప్రీమియర్ టైంని డిసైడ్ చేశాక దీన్ని ప్రకటించబోతున్నారు. ఇదిలా ఉండగా మొదటి ఎపిసోడ్ లో రామ్ చరణ్ ఫస్ట్ గెస్ట్ గా రాబోతున్న సంగతి ఇప్పటికే బాగా ప్రచారం అయిపోయింది. ప్రైజ్ మనీగా పాతిక లక్షలు గెలుచుకుని ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఇచ్చేశాడని కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోలో ఇంకో రెండు మూడు రోజుల్లో వదలబోతున్నారు.

ఇక దీనికి దర్శకుడిగా సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ వ్యవహరిస్తున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. మంచి ప్యాకేజ్ తో పాటు సమయం వృధా కాకుండా వచ్చిన అవకాశం కావడంతో నో చెప్పకుండా చేసినట్టు సమాచారం. ఫస్ట్ సీజన్ పూర్తయ్యాక అప్పుడు వచ్చే రెస్పాన్స్ అండ్ రేటింగ్స్ ని బట్టి కొనసాగడం కూడా గురించి ప్లాన్ చేస్తారు. ఆఖరి ప్రశ్నకు ఇచ్చే మొత్తాన్ని పెంచారా లేక కోటికి మాత్రమే పరిమితం చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. లాస్ట్ సీజన్ ని చిరంజీవి హోస్ట్ చేసినప్పుడు స్టార్ మా ఛానల్ లో ఆశించిన స్పందన రాలేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ మీద చాలా అంచనాలు ఉన్నాయి.

Also Read: ప్రతిష్టాత్మక షోకి భారీ స్కెచ్

ఇతర ఛానల్స్ తో పోలిస్తే రియాలిటీ షోలలో వెనుకబడి ఉన్న జెమినిని ఎవరు మీలో కోటీశ్వరుడు మీద చాలా ఆశలు ఉన్నాయి. సరిగ్గా కనెక్ట్ అయితే టిఆర్పి ఓ రేంజ్ లో వస్తుందని నమ్మకంతో ఉంది. ఎప్పటిలాగే మధ్యలో కొందరు సెలబ్రిటీలతో స్పెషల్ ఎపిసోడ్లు కూడా ప్లాన్ చేశారట. ఇప్పటికైతే కామన్ ఆడియన్స్ పాల్గొన్న కొన్ని భాగాల షూటింగ్ ని పూర్తి చేశారు. ఆర్ఆర్ఆర్ కోసం టీమ్ తో కలిసి తారక్ యూరోప్ వెళ్లనున్న నేపథ్యంలో ఒక నెల టెలికాస్ట్ కు సరిపడా షూట్ చేసినట్టు సమాచారం. యంగ్ టైగర్ దీన్ని ఎలా నిర్వహించబోతున్నాడో ఇప్పటికీ వచ్చిన ఒక చిన్న ప్రోమో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది

Also Read: కోటీశ్వరుడు బిగ్ బాస్ – ఇద్దరూ రెడీ

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet