ప్రతిష్టాత్మక షోకి భారీ స్కెచ్

By iDream Post Jul. 22, 2021, 06:05 pm IST
ప్రతిష్టాత్మక షోకి భారీ స్కెచ్

జెమిని ఛానల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించబోతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు క్విజ్ ప్రోగ్రాం వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతుంది. అందుబాటులో ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా గ్రాండ్ లాంచింగ్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారట. మొదటి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. షూట్ కూడా జరిగిందంటున్నారు కానీ దానికి సంబంధించిన క్లారిటీ ఇంకా లేదు. ఈ సిరీస్ లో రాబోతున్న మొదటి భాగం కాబట్టి దానికి అనుగుణంగా జెమినీ చాలా భారీ స్కెచ్ తో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

ఆర్ఆర్ఆర్ కాంబినేషన్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇలా కలిసి బుల్లితెర మీద కనిపించడం ఖచ్చితంగా సెన్సేషన్ అవుతుంది. రేటింగ్స్ కూడా ఆశించిన దానికన్నా ఎక్కువే రావొచ్చు. నేషనల్ హాలిడే కనక చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అక్టోబర్ 13 ఆర్ఆర్ఆర్ విడుదల ప్లాన్ చేసిన నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రమోషన్లు ఉధృతంగా పెంచేశారు. అందులో భాగంగానే ఇప్పుడీ రియాలిటీ షోను కూడా దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. చరణ్ తారక్ ల ఆన్ స్క్రీన్ బాండింగ్ మొదటిసారి చూసే అవకాశం కావడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఇష్టంతో సంబంధం లేకుండా భారీగా చూస్తారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ప్రాజెక్టుకు మాత్రమే కమిట్ అయిన జూనియర్ ఎన్టీఆర్ దాని రెగ్యులర్ షూటింగ్ కి ఇంకా టైం ఉండటంతో ఆ కాల్ షీట్లు ఈ షోకి ఇచ్చాడు. ఆచార్య పూర్తయ్యే దాకా కొరటాల బయటికి రాలేడు. దానికి తోడు ప్రమోషన్ల కోసం కొంత టైం కేటాయించాలి. ఈ సమయం తారక్ కి ఉపయోగపడుతుంది. మరోవైపు చరణ్ శంకర్ తో చేయబోయే ప్రాజెక్టు తాలూకు పనులను వేగవంతం చేశాడు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.థమన్, జానీ మాస్టర్, సాయి మాధవ్ బుర్రా తదితరులు ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగం పంచుకుంటున్నారు. సో ప్లానింగ్ ఇలా సాగుతోందన్న మాట

Also Read: ఇంట్లోకి హంతకుడు వస్తే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp