iDreamPost
android-app
ios-app

ఆర్బీఐ మని యాప్

ఆర్బీఐ మని యాప్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సరికొత్త మొబైల్ యాప్‌ను లాంచ్‌ చేసింది. కంటిచూపు సరిగ్గాలేని వారు కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్(మని) అప్లికేషన్‌ను తీసుకొచ్చింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ను ఐవోఎస్ ఆపిల్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ల నుంచి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

యాప్‌ డౌన్‌లోడ్

యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెల్లి మని అని టైప్ చేయాలి. ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ అప్లికేషన్‌ను యాక్స్‌స్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌ను ఓసారి డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్‌లో లేకపోయినా అంటే ఆఫ్‌లైన్‌లో ఉన్నా పని చేస్తుంది. .

ఎలా ఉపయోగించాలి?

వినియోగదారులు మని యాప్ ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత మొబైల్ కెమెరాను ఉపయోగించి కరెన్సీ నోట్‌ను స్కాన్ చేస్తే, హిందీ, ఆంగ్ల భాషల్లో నోట్ విలువ ఆడియోలో వినిపిస్తుంది. అయితే మని యాప్‌ నకిలీ నోట్లను గుర్తించలేదని ఆర్బీఐ తెలపడం గమనార్హం.

2016 నవంబర్‌లో డీమోనిటైజేషన్ తర్వాత ఆర్‌బీఐ ‘మహాత్మా గాంధీ సిరీస్’ కింద కొత్త కరెన్సీ నోట్లు విడుదల చేసింది. రంగు, డిజైన్, పరిమాణాల్లో గణనీయమైన మార్పులతో కొత్త రూ .2000, రూ .500, రూ .200, రూ .100, రూ .50, రూ .20 రూ.10 నోట్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిని గుర్తించిడంలో అంధులు అనేక సమస్యలను ఎదుర్కొటున్న నేపథ్యంలో తాజా ఈ యాప్‌ను తీసుకొచ్చారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş