iDreamPost
android-app
ios-app

Liplock Challenge లిప్ లాక్ వైరల్ వీడియో క్లిప్, మంగళూరులో బైట‌కొచ్చిన‌ కాలేజీ విద్యార్థుల లైంగిక వేధింపులు, 8 మందిపై కేసు నమోదు

  • Published Jul 22, 2022 | 4:45 PM Updated Updated Jul 22, 2022 | 4:49 PM
  • Published Jul 22, 2022 | 4:45 PMUpdated Jul 22, 2022 | 4:49 PM
Liplock Challenge లిప్ లాక్  వైరల్ వీడియో క్లిప్, మంగళూరులో బైట‌కొచ్చిన‌ కాలేజీ విద్యార్థుల లైంగిక వేధింపులు, 8 మందిపై కేసు నమోదు

క‌ర్నాట‌క‌లో ముద్దుల పోటీ సంచ‌ల‌న‌మైంది. మంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థులు కిస్సింగ్ గేమ్(Liplock game) ఆడారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఒక‌ర్ని ఒక‌రు కిస్ చేసుకున్నారు. దీనికి ఫ్రెండ్స్ చీర్ చేస్తున్నారు. ఇందులో ఒక కండీష‌న్ కూడా ఉందంట‌. ముద్దులే ఇవ్వాలి, ఫ్రెంచ్ కిస్ వ‌ద్దంటూ ఒక కుర్రాడు చెబుతున్నాడుకూడా.

ఓ ప్రముఖ కాలేజీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. వీరిలో 17 ఏళ్ల కుర్రాడు, లైట్ హౌస్ హిల్ రోడ్ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో, తన క్లాస్‌మేట్స్‌లో ఇద్దరు లిప్ లాక్ చేస్తున్న వీడియో క్లిప్పింగ్‌ను, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు సమాచారం.

బుధవారం సాయంత్రం వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే, కుర్రాళ్లు లైంగిక వేధింపులకు పాల్పడిన సంగ‌తి బైట‌కొచ్చింది.

ఆరునెల‌ల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న వీడియోను బ‌య‌ట‌కు రిలీజ్ చేసిన విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. వారం క్రిత‌మే వీడియోను వాట్సాప్‌లో పెట్టాడ‌ని, అదికాస్తా వైర‌ల్ అయింది. మొద‌ట విద్యార్థుల‌కు వార్నింగ్ ఇచ్చిన కాలేజీ యాజ‌మాన్యం, ఆ త‌ర్వాత స‌స్పెండ్ చేసింది. కానీ పోలీసులకు ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌లేదు. ఈ కిస్సింగ్ గేమ్ లో మొత్తం 8 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ముగ్గురు అమ్మాయిలు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet