Idream media
Idream media
ఎన్టీఆర్ కుస్తీ పోటీల్లో గెలిచి , ఆ డబ్బుతో తండ్రికి వైద్యం చేయిస్తాడు. కానీ అతను తండ్రి కాదని తెలుస్తుంది. 1964లో వచ్చిన మంచి మనిషి సినిమా ఇది. ఒక మనిషి జీవితాన్ని పెంపకమే నిర్ణయిస్తుంది తప్ప పుట్టుక కాదు అనే పాయింట్‌తో సినిమా.
వీరయ్య (మిక్కిలినేని) కూలీ చేసుకుని జీవిస్తుంటాడు. అతని తండ్రి , తాత దొంగలు. ఇతను నిజాయితీపరుడు. ఒక సందర్భంలో దొంగతనం కేసు మీద పడుతుంది. తండ్రి దొంగ కాబట్టి , ఇతను కూడా దొంగేనని లాయర్ రంగనాథం (గుమ్మడి) శిక్ష వేయిస్తాడు. ఆ సమయంలో వీరయ్య భార్యకి నెలలు నిండి ఉంటాయి. వీరయ్య జైలు నుంచి తప్పించుకుంటాడు. బిడ్డని కని భార్య చనిపోయి ఉంటుంది. అదే సమయానికి రంగనాథానికి కూడా కొడుకు పుట్టి వుంటాడు. నర్సుని బెదిరించి బిడ్డల్ని తారుమారు చేస్తారు.
సంపన్నుడిగా పెరగాల్సిన వేణు (NTR ) పేదవాడిగా పెరుగుతాడు. పేదవాడిగా వుండాల్సిన వాసు డబ్బున్న వాళ్లింట్లో పెరుగుతారు. తండ్రి మళ్లీ జైలుకి వెళ్లడంతో వేణు దొంగగా మారుతాడు. సొంత మరదలని తెలియక సుశీల (జమున) ని ప్రేమిస్తాడు.
ఒక సందర్భంలో వేణు దొంగని తెలుస్తుంది. దీనికి O.Henry కథని వాడుకున్నారు. గుమ్మడి ఇంట్లో జమున బర్త్‌డే పార్టీ. ఒక సేఠ్ వచ్చి బీరువాని కానుకగా ఇస్తాడు. తాళం లేకుండా దాన్ని తీయడం అసాధ్యం. పార్టీ జరుగుతూ వుండగా ఒక చిన్న పాప బీరువాలో లాక్ అయిపోతుంది. తాళం లేకుండా పాప చేతిలోనే వుంటుంది.
ఆ బీరువాని గజదొంగ మాత్రమే తీయగలడని అంటారు. పాపని బీరువా తీసి వేణు రక్షిస్తాడు. అతను గజదొంగ అని అందరికీ తెలిసిపోతుంది. జైలుకి వెళ్తాడు.
క్లైమాక్స్‌లో వీరయ్య అసలు రహస్యం చెబుతాడు. పిల్లలు మారిపోయే సినిమాలు చాలా వచ్చాయి. అదే జానర్‌తో వచ్చిన అలవైకుంఠపురంలో సూపర్‌హిట్.
మంచి మనిషికి ఎస్.రాజేశ్వరరావు , టి.చలపతిరావు ఇద్దరూ సంగీతం అందించారు. “అంతగా చూడకు” “రాననుకున్నావేమో” “ఓహ్ గులాబీ బాలా” సూపర్ హిట్ సాంగ్స్, యూట్యూబ్‌లో ఉంది. గొప్ప సినిమా కాదు కానీ, బోర్ కొట్టదు.