iDreamPost
android-app
ios-app

భార్యను డంబెల్ తో కొట్టాడు… ముక్కలు చేసి డ్రమ్ములో వేశాడు

భార్యను డంబెల్ తో కొట్టాడు… ముక్కలు చేసి డ్రమ్ములో వేశాడు

మనుషుల్లో నేర ప్రవృత్తి రోజురోజుకు పెరిగిపోతోందని చెప్పేందుకు వరుసగా జరుగుతున్న సంఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ లో జరిగిన మరో సంఘటన అందిరినీ షాక్ కు గురి చేసింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న రెండో భార్యని డంబెల్ తో కొట్టి, ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో కుక్కాడు ఓ నీచుడు.

మాల్ లో పనిచేసే సరోజకు పూల అలంకరణ పని చేసే అనిల్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో, పెద్దల సమక్షంలో 9 నెలల క్రితం పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి సుభాష్ చంద్రబోస్ నగర్ లో కాపురం పెట్టారు. అయితే భర్తకు గతంలోనే వివాహం అయినట్లు, నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు సరోజకు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

సరోజను దారుణంగా కొట్టడంతో ఆ విషయాన్ని తల్లిదండ్రులతో ఫోన్ లో చెప్పింది. ఈ నెల 2వ తేదీ నుంచి ఫోన్ కాల్స్ కు సరోజ స్పందించడం లేదు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ఆదివారం కూతురు ఇంటికి వెళ్ళారు. ఇంటికి తాళం వేసి ఉండటం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరునాడు కూడా ఇంటికి తాళం వేసి ఉండటంతో, తాళం పగలగొట్టి లొపలకు వెళ్ళిన వారికి ఇల్లంతా ఒకటే వాసన వచ్చింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇంటిని సోదా చేయగా, నీళ్ళ డ్రమ్ములో సరోజ మృతదేహాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. నిందితుడు అనీల్ తన భార్యను డంబెల్ తో కొట్టి చంపాడు. ఆ తరువాత ఆమెను ముక్కలుగా నరికి డ్రమ్ములో కుక్కాడు. ఈ ఘటనతో స్థానికులంతా ఒక్కసారిగా విస్తుపోయారు.

ఈ కిరాతకానికి పాల్పడిన నిందితుడు ముందు పరారీలో ఉండగా, సోమవారం రాత్రి లొంగిపోయాడు. వాస్తవానికి 2009లోనే అనిత అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు అనిల్. నలుగురు సంతానం తరువాత కూడా అదనపు కట్నం కావాలని వేధించాడు. 2020లో ఆమెను కరెంటు హీటరుతో కొట్టి, తలను గోడకు వేసి మోది మరీ చంపాడు. ఆ కేసులో రిమాండ్ లో ఉన్న అనిల్, ఏడాది ముందే బెయిల్ పై వచ్చాడని పోలీసులు తెలిపారు.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş