iDreamPost
android-app
ios-app

నా పిల్లలకు అమ్మని దూరం చేశావ్.. నిన్ను చంపి నా భార్యను తీసుకెళ్తా.. అన్నంత పనీ చేశాడు

  • Published Jun 16, 2022 | 10:26 AM Updated Updated Dec 23, 2023 | 6:18 PM

ఐదేళ్లుగా భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తోంది. అయిందేదో అయిపోయింది. పిల్లలకోసమైనా ఇంటికి వచ్చేయ్ అని భర్త అనురాధను బ్రతిమిలాడాడు. అయినా ప్రియుడు ఇమ్మానియేల్ ను వదిలి రానని చెప్పడంతో.. కోపంతో రగిలిపోయాడు.

ఐదేళ్లుగా భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తోంది. అయిందేదో అయిపోయింది. పిల్లలకోసమైనా ఇంటికి వచ్చేయ్ అని భర్త అనురాధను బ్రతిమిలాడాడు. అయినా ప్రియుడు ఇమ్మానియేల్ ను వదిలి రానని చెప్పడంతో.. కోపంతో రగిలిపోయాడు.

నా పిల్లలకు అమ్మని దూరం చేశావ్.. నిన్ను చంపి నా భార్యను తీసుకెళ్తా.. అన్నంత పనీ చేశాడు

పెళ్లై ఇద్దరు పిల్లలున్న అనురాధ.. వివాహేతర సంబంధానికి అలవాటుపడింది. ఐదేళ్లుగా భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తోంది. అయిందేదో అయిపోయింది. పిల్లలకోసమైనా ఇంటికి వచ్చేయ్ అని భర్త అనురాధను బ్రతిమిలాడాడు. అయినా ప్రియుడు ఇమ్మానియేల్ ను వదిలి రానని చెప్పడంతో.. కోపంతో రగిలిపోయాడు. నా పిల్లలకు తల్లిని లేకుండా చేసిన నిన్ను వదలను అంటూ భర్త రవి హెచ్చరించాడు. ఆఖరికి అన్నంత పనీ చేశాడు. అవకాశం కోసం ఎదురుచూసిన రవి.. పదకం ప్రకారం.. ఇమ్మానియేల్ ను హత్య చేశాడు. ఈ ఘటన ఉమ్మడి కడపజిల్లా ప్రొద్దటూరులో జరిగింది.

సుమారు ఐదేళ్ల క్రితం రవి భార్య అనురాధ భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఇమ్మానియేల్ తో ప్రొద్దుటూరుకు వచ్చేసింది. కొద్దిరోజుల తర్వాత రవి అనురాధను తిరిగి కాపురానికి రావాలని విజ్ఞప్తి చేశాడు. పిల్లలు అమ్మా అని తపిస్తున్నారు.. పోదాం రా అని ఎంతగా బతిమాలినా ఆమె కనికరించలేదు. ఆమె మనసు కరగలేదు. దాంతో నా పిల్లలకు తల్లిని లేకుండా చేశావ్‌. నిన్ను చంపేసి నా భార్యను తీసుకెళ్తా అని రవి ఇమ్మానియేల్ ను హెచ్చరించాడు. అతనిపై పగ పెంచుకున్నాడు. రవి మాటలను ఇమ్మానియేల్ లైట్ తీసుకున్నాడు. కానీ.. రవి మాత్రం ఆ రోజునుంచి అతడిని చంపే రోజుకోసం ఎదురుచూశాడు. అనుకున్న సమయం రానేవచ్చింది. ప్రకాష్ నగర్లోని ఇటుకల బట్టీ వద్ద ఇమ్మానియేల్ నిద్రిస్తున్నట్లు తెలుసుకున్నాడు.

సోమవారం (జూన్ 13) అర్థరాత్రి ఇమ్మానియేల్ నిద్రిస్తున్న సమయంలో రవి తనవెంట తెచ్చుకున్న పిడిబాకుతో పొడిచి చంపాడు. అనంతరం రవి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. మోడంపల్లె బైపాస్‌ రోడ్డులో వెళ్తున్న రవిని అరెస్ట్ చేసి అతని వద్దనుంచి బైక్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అతనిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.

 

 

 

 

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş