iDreamPost
android-app
ios-app

భార్యకు ముద్దుపెట్టిన భర్త.. చితక్కొట్టిన స్థానికులు.

  • Published Jun 23, 2022 | 9:12 AM Updated Updated Jun 23, 2022 | 11:51 AM
భార్యకు ముద్దుపెట్టిన భర్త.. చితక్కొట్టిన స్థానికులు.

భార్యకు ముద్దుపెట్టిన భర్తను అసభ్య పదజాలంతో తిట్టడంతో పాటు.. అతడిని పక్కకు లాగి కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. భార్యకు ముద్దుపెడితే కొట్టడం ఏంటి ? అనే కదా మీ సందేహం. అతను తన భార్యకు నాలుగు గోడల మధ్య ముద్దుపెట్టలేదు. నలుగురూ చూస్తుండగా .. అది కూడా నదీస్నానం చేస్తుండగా ముద్దు పెట్టాడు. పవిత్రమైన నదీస్నానం చేసేటపుడు భార్యకు ముద్దుపెట్టడం అక్కడున్న వారిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఘటన అయోధ్యలో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్ లోని శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ప్రవహించే పవిత్రమైన సరయూనదిలో ఓ జంట స్నానం చేసేందుకు దిగింది. ఈ క్రమంలో భర్త తన భార్యకు ముద్దుపెట్టాడు. పక్కనే స్నానం చేస్తున్న పలువురు ఇది గమనించి.. అతడిని నది నుంచి పక్కకు లాగి అసభ్యపదజాలంతో తిట్టాడు. ఆపై చేయిచేసుకున్నారు. పవిత్రమైన అయోధ్యలో బహిరంగంగా ఇలాంటి పనులు చేయడాన్ని సహించబోమని ఆ గుంపులో ఉన్న ఓ వ్యక్తి తెలిపాడు. ఇదంతా ఎవరో వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. విషయం పోలీసుల దృష్టికి చేరడంతో.. ఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş