iDreamPost
android-app
ios-app

బ్రాహ్మణ కార్పొరేషన్‌ కు కొత్త చైర్మన్‌

బ్రాహ్మణ కార్పొరేషన్‌ కు కొత్త  చైర్మన్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఎమ్మెల్యే కు నామినేటెడ్ పదవి కట్టబెట్టింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ను ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మల్లాది విష్ణు చైర్మనుగా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.

ఇప్పటికే ఎమ్మెల్యే లుగా ఉన్న మరి కొంత మందికి నామినేటెడ్ పోస్ట్లు ల్లో జగన్ సర్కార్ నియమించింది. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ను ఏపీఐఐసీ చైర్మన్ గా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ని సీఆర్డీఏ చైర్మన్ గా, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ను కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. తాజాగా ఎమ్మెల్యే విష్ణుకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో కూర్చోపెట్టింది.