iDreamPost
android-app
ios-app

వంశీతో మహేష్ 27 లేనట్టేనా ?

  • Published Feb 22, 2020 | 9:33 AM Updated Updated Feb 22, 2020 | 9:33 AM
వంశీతో మహేష్ 27 లేనట్టేనా ?

ఇప్పుడీ ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత తనకు మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లితో చేస్తానని మహేష్ బాబు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజా అప్ డేట్ ప్రకారం ఆశించిన విధంగా స్క్రిప్ట్ రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం. కథకు సంబంధించి కొన్ని లీక్స్ గతంలోనే బయటికి వచ్చాయి. ప్రిన్స్ ఇందులో కాలేజీ ప్రొఫెసర్, మాఫియా డాన్ గా రెండు పాత్రలను చేస్తాడని చాలా డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కుతుందని గట్టిగానే వినిపించింది.

అయితే ఫైనల్ వెర్షన్ అనుకున్న రీతిలో రాకపోవడంతో మళ్ళీ చూద్దామని వంశీ పైడిపల్లితో మహేష్ అన్నట్టు ఇప్పుడు చక్కర్లు కొడుతున్న వార్తల సారాంశం. ఇక్కడ అభిప్రాయ భేదాలు ఉన్నయని అనుకోవడానికి లేదు. ఎందుకంటే హీరో డైరెక్టర్ కు మించిన ఫ్రెండ్ షిప్ బాండింగ్ ఇద్దరి మధ్య ఉంది. ఈ నేపథ్యంలో వేరే కథ చూడమని మహేష్ చెప్పి ఉండొచ్చేమో కానీ అసలు సినిమానే వద్దు అని చెప్పి ఉండకపోవచ్చుఇప్పుడు కొత్త స్క్రిప్ట్ అంటే వంశీ పైడిపల్లికి చాలా టైం కావాలి.

ఇప్పుడు నో చెప్పింది నిజమే అనుకున్నా దీనికే సుమారు ఏడెనిమిది నెలలు పని చేశాడు వంశీ పైడిపల్లి. ఇప్పుడు తనకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి వేరే హీరోతో వెళ్లిపోవడం. లేదా మహేష్ కు కొత్త స్క్రిప్ట్ రెడీ చేయడం. అయితే మహేష్ బాబు నెక్స్ట్ ఎవరితో చేస్తాడనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఎఫ్3లో స్పెషల్ రోల్ అని ఒకసారి లేదు మెగాస్టార్ ఆచార్యలో క్యామియో అని మరోసారి ఏవేవో టాక్స్ వస్తున్నాయి. దీనికి చెక్ పడాలి అంటే మహేష్ ట్విట్టర్ లోనో లేదా ఇంకో మార్గంలోనో స్వయంగా ప్రకటిస్తే బెటర్. ఇప్పటికైతే దీన్ని ప్రచారంగా తీసుకోవాలి తప్పించి నిజమని ఖరారుగా చెప్పడానికి లేదు కాబట్టి అంతదాకా వెయిట్ చేద్దాం.

jojobet girişmarsbahiscasibomjojobet girişjojobet