iDreamPost
android-app
ios-app

మహేష్, తారక్ – ఛాయస్ ఎవరో ?

  • Published Apr 14, 2020 | 5:32 AM Updated Updated Apr 14, 2020 | 5:32 AM
మహేష్, తారక్ – ఛాయస్ ఎవరో ?

కన్నడలో మొదటి సినిమా ఓమాదిరిగా హిట్ అయినప్పుడు అతని గురించి కర్ణాటక మూవీ లవర్స్ కు మాత్రమే తెలిసింది. కానీ ఎప్పుడైతే కెజిఎఫ్ రూపంలో ఆల్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడో ఆ క్షణం నుంచి బాలీవుడ్ స్టార్లు సైతం ఫోన్ చేసి ఏదైనా సబ్జెక్టు ఉంటే చెప్పమని అడిగే దాకా రేంజ్ పెరిగిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కెజిఎఫ్ 2 ఫినిషింగ్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ అక్టోబర్ 23 అది విడుదలయ్యే దాకా ఇంకో ఆలోచన చేసే పరిస్థితిలో లేడు. కానీ తర్వాత మూవీ మాత్రం ఖచ్చితంగా తెలుగులోనే ఉంటుందన్నది పక్కాగా చెప్పొచ్చు.

అఫ్ కోర్స్ అది కూడా మల్టీ లాంగ్వేజ్ గా భారీ స్థాయిలోనే ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ప్రశాంత్ నీల్ కు ప్రస్తుతం రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జూనియర్ ఎన్టీఆర్ కోసం మైత్రి సంస్థకు ఒక కమిట్ మెంట్ ఇచ్చాడు. రెండోది మహేష్ బాబు కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. అది గీతా ఆర్ట్స్ బ్యానర్ కోసం అల్లు అరవింద్ లాక్ చేసుకున్నట్టుగా ఇప్పటికే ఫిలిం నగర్ టాక్ ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ ఎలాగూ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎంత లేదన్నా ఓ ఏడెనిమిది నెలలు లాక్ అయిపోతాడు. ఆ తర్వాత ప్రశాంత్ తో ట్రావెల్ చేయొచ్చు. మరోవైపు మహేష్ అయితే పరశురామ్ లేదా వంశీ పైడిపల్లి అని రెండు ఆప్షన్స్ పెట్టుకున్నాడు. దానికీ అంతే టైం పడుతుంది.

ఒకవేళ దీంట్లో ఏదైనా ఆలస్యం జరిగితే అల్లు అరవింద్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ మహేష్ తో సినిమాని మొదలుపెట్టేస్తాడు. కాని ఇక్కడ వచ్చిన చిక్కు ఎవరిది ఎంత సమయంలో పూర్తవుతుదన్నదే. దీనికి తోడు కరోనా వల్ల మొత్తం తారుమారైపోయింది. అసలు కెజిఎఫ్ 2 చెప్పిన టైంకు దసరాకే వస్తుందా రాదా అనే సందేహాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రశాంత్ నీల్ మరి తారక్ వైపు చూస్తాడా లేక మహేష్ వైపు వెళ్తాడా అనేది కాలమే సమాధానం చెప్పాలి. టైం అటు ఇటు అయినా ఇద్దరితో చేయడం అయితే ఫిక్స్ అని సన్నిహితుల మాట. మరోవైపు ప్రశాంత్ నీల్ కన్నడ హీరోలను కాకుండా ఇలా పక్క రాష్ట్రాల స్టార్లతో చేసేందుకు ఉత్సాహం చూపించడం ఏంటని సోషల్ మీడియాలో కొందరు నెటిజెన్లు కామెంట్ చేయడం గమనార్హం.

jojobet girişJojobet GirişCasibomivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetBetvolemarsbahis girişJojobet GirişJojobet Girişcasibom