Idream media
Idream media
మహరాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అధికార బిజెపి కూటమి అత్యధిక సీట్ల లో ఆధిక్యం లో ఉంది. మొత్తం 288 స్థానాలకు గాను బీజేపీ-శివసేన కూటమి 158 స్థానాల్లో ఆధిక్యం లో ఉంది. కాంగ్రెస్ఎన్సీపీ కూటమి 98 స్థానాల్లోనూ, విబిఏ 1 స్థానం, ఇతరులు 31 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 145 స్థానాలు గెలుచుకున్న పార్టీ/ కూటమి అధికారం చేపడుతుంది. ఫలితాల సరళి ఇలాగే కొనసాగితే బిజెపి- శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ వస్తుంది. గత శాసన సభ ఎన్నికల్లో బిజెపి కూటమి 185 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 87, ఇతరులు 16 సీట్లు గెలిచాయి.