iDreamPost
android-app
ios-app

లూసిఫర్ కథ మళ్ళీ మొదటికి

  • Published Nov 08, 2020 | 7:35 AM Updated Updated Nov 08, 2020 | 7:35 AM
లూసిఫర్ కథ మళ్ళీ మొదటికి

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ముచ్చటపడి ఎలాగైనా చేసే తీరాలని కంకణం కట్టుకున్న మలయాళం లూసిఫర్ రీమేక్ కథ షూటింగ్ మొదలుకాకుండానే చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. ఒరిజినల్ వెర్షన్ లో చాలా కీలకమైన మార్పులు ఎన్నో అవసరం ఉండటంతో చిరుని మెప్పించేలా ఏ దర్శకుడూ ఫైనల్ వెర్షన్ చేయలేకపోతున్నారని ఇన్ సైడ్ టాక్. ముందు సుజిత్ ను తీసుకున్నారు. అతను టీమ్ తో కలిసి నెలల తరబడి ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. కానీ అది కొణిదెల క్యాంప్ ని మెప్పించలేకపోయింది. కుర్రాడు దీన్ని డీల్ చేయలేడేమో అన్న అనుమానంతో సున్నితంగా డ్రాప్ చేయించారు.

తర్వాత వివి వినాయక్ సీన్లోకి వచ్చారు. అన్నయ్యతో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 రెండు రీమేక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన అనుభవం ఉండటంతో ఫామ్ లో లేకపోయినా సరే తనే రైట్ ఛాయస్ అనుకున్నారు. ఆకుల శివతో కలిసి ఇంకో ఫ్రెష్ వెర్షన్ తయారు చేశారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇదీ సంతృప్తికరంగా రాలేదట. దీంతో ఇప్పుడు వినాయక్ కూడా ఇందులో నుంచి బయటికి రావొచ్చనే ప్రచారం ఫిలిం నగర్ లో జోరుగా సాగుతోంది. నిజానికి సుజిత్ రావడం కానీ వినాయక్ ఎంట్రీ కానీ ఏదీ నిర్మాత రామ్ చరణ్ అఫీషియల్ గా చెప్పలేదు. ఇవన్నీ అంతర్గతంగా జరిగిపోయి లీకుల రూపంలో బయటికి వచ్చాయి.

లూసిఫర్ లో రాజకీయ అంశాలు ముడిపడి ఉండటంతో ఇమేజ్ కి ఎలాంటి ఇబ్బంది రాకుండా హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా దీన్నో కొలిక్కి తీసుకురావడంలోనే చిక్కులన్నీ వస్తున్నట్టు సమాచారం. ఆచార్య అయ్యాక చిరు వెంటనే మెహర్ రమేష్ తో వేదాళం మొదలుపెట్టేస్తారు. అది పూర్తయ్యేలోగా 2021 గడిచిపోతుంది. ఆ తర్వాత ఈ లూసిఫర్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలి. అసలు అంతగా దాని వెనుక పడటం కూడా సబబు కాదనేది అభిమానుల అభిప్రాయం. ఇప్పటికే దాని తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రైమ్ లో చూసిన ప్రేక్షకులు కూడా అంతగా ఇందులో ఏముందాని ఆశ్చర్యపోతున్న మాట వాస్తవం.