Idream media
Idream media
రాష్ట్రంలో రాజకీయంగా ఇమేజ్ పెంచుకునేందుకు లోకేష్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. వేష, భాష కూడా మార్చుకుంటూ ప్రజలను, పార్టీ నాయకులను ఆకట్టుకోవాలని తపన పడుతున్నారు. కొన్ని సార్లు సెల్ఫ్ గోల్ తో నవ్వులపాలవుతున్నారు. అసత్య ఆరోపణలు, కట్టుకథలతో ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా నిరుద్యోగులను, యువతను ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా శవ రాజకీయాలకు తెర లేపారు. కానీ.. మృతిని తమ్ముడే తనకు లేఖ రాశాడని డ్రామాను రక్తి కట్టించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయ్యాడు. ఎప్పుడో ఆరు నెలల క్రితం మరణించిన వ్యక్తి ఇప్పుడు మృతి చెందినట్లు సృష్టించి అబాసుపాలయ్యారు.
టీడీపీ అసత్య ప్రచారాలు రోజురోజుకు అడ్డు అదుపులేకుండా పోతుంది. తాజాగా నారా లోకేశ్ తన తండ్రి చంద్రబాబును మించిపోయాడు. అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయడంలో బాగా ముదిరిపోయాడు. లేనిది ఉన్నట్లు సృష్టించడంలో ఆరితేరిపోయాడు. ప్రభుత్వంపై బురుదజల్లేందుకు కుట్రలు, కుయూక్తులు పన్నుతున్నాడు. ఆఖరికి శవ రాజకీయాలు చేయడంలో కూడా వెనకాడంలేదు. మృతుడి తమ్ముడు రాశాడంటూ లోకేష్ ప్రచారం చేస్తున్న ఓ లేఖ అసత్యమని పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. తనకేమి తెలియదని టీడీపీ నేతలు వచ్చి సంతకం చేయమంటే చేశానని స్వయాన మృతుడి తమ్ముడే చెప్పడంతో పచ్చనేతల బండారం బట్టబయలైంది.
కర్నూలు జిల్లా గూడురు మండలం చునుగొండ్లలో గోపాల్ అనే యువకుడు ఆరు నెలల క్రితం ఆత్మ హత్య చేసుకున్నాడు. దానిని ఇప్పడు బయటకు తీసి టీడీపీ నేతలు యువకుడి మృతిపై కట్టుకథ అల్లారు. డ్రామా బాగా రక్తి కట్టించాలని ప్రయత్నించి బొక్కబోర్లపడ్డారు. చనిపోయిన వ్యక్తి పేరు మీద లేఖ రాయించి ఉద్యోగం లేకే చనిపోయాడని కట్టుకథ అల్లేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు పచ్చనేతలు. ఈ డ్రామాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం నారా లేకేశ్‌దే అని తెలుస్తోంది. ఇక్కడ నకిలీ సూసైడ్ లేటర్ తయారైందో లేదో.. అక్కడే ట్వీటర్‌లో లోకేశ్‌బాబు తప్పుడు కూతలు మొదలైనాయి. ఉద్యోగం రాక గోపాల్ చనిపోయాడంటూ పచ్చ కలర్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈలోగా రంగంలోకి దిగిన పోలీసులు గోపాల్ అసలు సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరు బాధ్యులు కాదని గోపాల్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
మృతుని తమ్ముడు శ్రీనివాసులు చదువుకోలేదు. కేవలం సంతకం మాత్రమే చేయగలడు. లోకేశ్ నుంచి డబ్బులు ఇప్పిస్తామని ఆశపెట్టిన స్థానిక టీడీపీ నేతలు శ్రీనివాసులతో ఓ లెటర్‌పై సంతకం తీసుకున్నారు. దాని అధారంగా డ్రామాకు తెరలేపారు. ఇంకేముంది ఉద్యోగం రాక గోపాల్ మరణించాడాని వరుస ట్వీట్లతో రెచ్చిపోయాడు లోకేశ్. పోలీసులు అసలు విషయం బటయపెట్టడంతో జరిగిన వ్యవహారం మొత్తం చెప్పేశాడు గోపాల్ సోదరుడు శ్రీనివాసులు. ఈ వ్యవహారం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఉన్న పరువు కాస్తా ఇటువంటి వ్యవహారాలతో పోతోందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నట్లు తెలుస్తోంది.