iDreamPost
iDreamPost
రానా సాయిపల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాట పర్వం దాదాపు పూర్తయినట్టే. కొంచెం ప్యాచ్ వర్క్ మినహా అంతా ఫినిష్ చేశారని సెకండ్ వేవ్ లాక్ డౌన్ కు ముందే వార్తలు వచ్చాయి. ఏప్రిల్ చివరి వారంలో విడుదలని కూడా ప్రకటించారు. కానీ కరోనా వల్ల మళ్ళీ సమీకరణాలు మారిపోయాయి. ఇప్పుడు ఓటిటికి రావొచ్చనే ప్రచారం చాలా జోరుగా జరుగుతోంది. నారప్ప, దృశ్యం 2, విరాట పర్వంలను మూడు వేర్వేరు ఓటిటి సంస్థలకు నిర్మాత సురేష్ బాబు మంచి లాభాలకు ఇచ్చేశారని మీడియాలోనూ హై లైట్ అయ్యింది. కానీ టీమ్ నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ రావడం లేదు.
దీనికి కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి. నారప్ప రిలీజై అది మాగ్జిమమ్ రీచ్ కు చేరుకున్నాక దృశ్యం 2 లేదా విరాట పర్వంల పబ్లిసిటీ మొదలుపెట్టాలని నిర్ణయించుకోవడం. రెండోది సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ని తీసుకున్నారని ఇంకా రీ రికార్డింగ్ చాలా బ్యాలన్స్ ఉందని మరో టాక్. ఓటిటి డీల్ నిజమే అయినప్పటికీ నిర్మాతలు కోరుకున్న రేట్ ఇంకా రాకపోవడంతో ఆ చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. దాంతో కొంత ఆలస్యమైనా ప్రొడ్యూసర్లు టార్గెట్ పెట్టుకున్న డీల్ వస్తేనే ఈ రిలీజ్ లాక్ అవుతుందని సమాచారం
ఈలోగా థియేటర్లు తెరుచుకుంటాయి కానీ ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్టులు ఇప్పుడున్న పాండెమిక్ వాతావరణంలో ప్రేక్షకులు ఎంత మేరకు రిసీవ్ చేసుకుంటారు అనేది అనుమానమే. అందుకే డిజిటల్ లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని ఇన్ సైడ్ టాక్. ఈ సినిమాతో పాటు దృశ్యం 2కు సంబంధించిన ఏ అప్ డేట్ అయినా సరే నారప్ప సందడి పూర్తిగా తగ్గిపోయాక వస్తాయి తప్ప అంతకన్నా ముందు రావు. 90వ దశకంలో వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపించిన నక్సలైట్ ఉద్యమాన్ని నేపథ్యంగా తీసుకున్న దర్శకుడు వేణు ఊడుగుల ఇందులో చాలా సున్నితమైన అంశాలు స్పృశించారు. ప్రియమణి, నందితా దాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు